రు. 280 కోట్ల బ‌డ్జెట్‌... మెగాస్టార్ చిరంజీవి... అటు రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌... ఎలాగూ ఐదు భాష‌ల్లో సినిమా తీస్తున్నాం క‌దా.. అక్క‌డ కూడా క్రేజ్ వ‌చ్చేందుకు ఆయా భాష‌ల నుంచి కొంత‌మంది క్రేజీ హీరోల‌ను తీసుకుందాం... బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నాం కదా అక్కడ మంచి మార్కెట్ ఉంటుంది బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు అయిన గోసాయి వెంకన్న పాత్రలో చేయిద్దాం... ఇక కన్నడంలో సినిమాకు క్రేజ్ వచ్చేందుకు బాహుబలి సినిమాలో ఫ‌ర్షియా రాజు పాత్రలో నటించిన సుదీప్‌ను తీసుకు వచ్చేద్దాం... ఇక కోలీవుడ్లో సినిమాకు క్రేజ్ కోసం అక్క‌డ యంగ్‌ హీరోగా ఉన్న విజయ్ సేతుపతిని తెచ్చుకుందాం... ఇంకా రావాలంటే భోజ్‌పురి నటుడు రవికిషన్ సింగ్‌తో కూడా ఏదో ఒక పాత్ర వేయిద్దాం.


ఇలా కలవు ఒక అందమైన ఊహ క్రియేట్ చేసుకున్న సురేందర్ రెడ్డి... ఈ ఈ సెటప్ అంత బాగా చేసుకుని కీలకమైన కథ కథనాల విషయంలో మాత్రం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదిన చందంగా వ్యవహరించాడు. అందుకే సైరాకు ఎక్కువగా నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. ఎంతో మంది ప‌ర‌భాషా న‌టుల‌ను తీసుకొచ్చి వాళ్ల‌కు మంచి క్యారెక్ట‌ర్ల‌ను ఇచ్చిన సురేంద‌ర్ మ‌న తెలుగు సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబుకు మాత్రం తీవ్ర అన్యాయం చేశాడు. సామంత రాజులుగా నటించిన కిచ్చ సుదీప్ సైరా అంటే తీవ్రమైన వైరుధ్యం ఉన్న వ్యక్తిగా మెప్పించాడు. సామంత రాజు పాత్రలో జగపతిబాబు కంటే సుదీప్ పాత్ర బాగా హైలెట్ అయ్యింది.


ఇక సామంత రాజుగా న‌టించిన జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌కు అంత‌ స్కోప్ లేదు. చివ‌ర్లో బ్రిటీష‌ర్ల మాయ‌మాట‌ల‌కు లొంగిపోయి సైరాను వాళ్ల‌కు ప‌ట్టించి ఆ ప‌శ్చాత్తాపంతో చ‌నిపోయే పాత్ర‌లో న‌టించినా జ‌గ‌ప‌తిబాబు పాత్ర కంటే కిచ్చ సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ పాత్ర‌లే ఎక్కువుగా హైలెట్ అయ్యాయి. తెలుగులో సీనియ‌ర్ న‌టుడుగా ఉన్న జ‌గ‌ప‌తిబాబు పాత్ర కంటే ఉత్త‌రాది న‌టుడు ర‌వి కిష‌న్ సింగ్, క‌న్న‌డ న‌టుడు సుదీప్ పాత్ర‌కే ఎక్కువ ప్ర‌యార్టీ ఇచ్చిన‌ట్ల‌నిపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: