ఇటీవల రిలీస్ ఐనా డియర్ కామ్రేడ్‌.. విజయ్‌ దేవరకొండ పెద్ద హిట్ రాలేదు. విజయ్‌ కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిపోతుందని అనుకున్నా సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో విజయ్‌ దేవరకొండ చాల ఆలోచనలో పడ్డాడు. తదుపరి చిత్రాల ఎంచుకోవడం  విషయంలో చాల జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తునాడు.ఒకే ఒక్కా సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తొలి విజయం అందుకున్న ఈ యంగ్‌ హీరో తరువాత అర్జున్‌ రెడ్డితో జాతీయ స్థాయిలో రికార్డు సాధించాడు. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవ్వర్ సినిమాతో చాల బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ కి జంటగా రాశీఖన్నా హీరోయిన్ పాత్ర పోసింస్తుంది . ఈ సినిమా తర్వాత పూరి దర్శకత్వంలో విజయ్ సినిమా ప్రారంభిస్తాడు. ఈ సినిమాకోసం ఫైటర్ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. అంతేకాదు.. ఇది అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సీక్వెన్స్ గా ఉంటుంది అని పెద్ద టాక్.

ఫైటర్  సినిమాలో విజయ్ కి జంటగా శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తీసుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం ఉంది. విజయ్ అంటే జాన్వీకి చాల ఇష్టం.  తనకి అవకాశం వస్తే విజయ్ దేవరకొండలా మారాలని ఉందని కూడా తెలిపింది. తన అభిమానులను రౌడీస్‌ అంటూ పలకరిస్తూ వారికి మరింత చేరువయ్యాడు విజయ్‌. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ మూవీ హీరోలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు. ప్రొఫెషనల్ రేసర్‌గా కనిపించేందుకు ట్రైనింగ్‌ కూడా తీసుకున్నాడు అర్జున్‌ రెడ్డి అని తెలుస్తుంది.

ఇక పూరి జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్‌, పీసీ కనెక్ట్స్‌ పతాకాలపై నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ మరోసారి తన స్టామినా ప్రూవ్‌ చేసుకోవటం ఖాయం అని భావిస్తున్నారు ఫ్యాన్స్‌. హీరోలను బ్యాడ్‌ ఇమేజ్‌తో ప్రొజెక్ట్ చేసే పూరి, ఈ రౌడీ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశాడా అని అభిమానులు కూడా చాల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: