అప్పుడెప్పుడో కొన్నేళ్లక్రితం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శుభలగ్నం అనే సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. పక్కింటి పిన్నిగారు కాసులపేరు చూడు అన్న సాంగ్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ పాటలో ఉన్న అర్థం ఎప్పటికీ ఫ్రూవ్‌ అవుతూనే ఉంటుంది. మన పక్కింటి వాళ్లు... పొరిగింటి వాళ్లు ఏదో చేశారని మనం వాళ్ళలా ప్రయత్నిస్తే బొక్క బోర్లా పడడం తో పాటు ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్న స్థితికి దిగజారిపోతాం.


బాహుబలి సినిమాల‌ తర్వాత మన తెలుగు సినిమా మేకర్స్ లో చాలామంది ఇంతే స్థితిలో ఆలోచిస్తున్నారని చెప్పాలి. బాహుబలి 1, 2 సినిమాలతో రాజమౌళి దేశం గర్వించదగ్గ సినిమాలు తీసిన డైరెక్టర్ గా గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రు. 2500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పాయి. బాహుబలి సినిమా కథ, కథనాలు...ఆ సినిమాలో పాత్రలకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక, వారిని పాత్రలో పరకాయ ప్రవేశం చేసేలా చేయడం, కథని అద్భుతంగా తెరకెక్కించడం... ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వం ఇవన్నీ బాహుబలి భారీ హిట్ అవ్వడానికి కారణమయ్యాయి.


ఇక పులిని చూసి న‌క్క వాత‌లు పెట్టుకున్న‌ట్టు కోట్లు పెడితే అంత‌కు మించి కోట్లు వ‌చ్చేస్తాయ‌న్న అత్యాశ‌తోనే మ‌నోళ్లు కోట్లు  కుమ్మ‌రించి సైరా, సాహోలు చేసేశారు. అక్క‌డ ఇక్క‌డ తేడా పైన చెప్పుకున్న‌వే. ఇక్క‌డ కోట్లు కుమ్మ‌రించినా క‌థ‌, క‌థ‌నాల్లో డెప్త్ లేదు. సాహో, సైరా సినిమాల్లో అసలు విషయం మేటర్ పక్కకు వెళ్లిపోయింది. బాహుబలి ప్రధాన బలం కథ-కథనం. ఇవే సాహో, సైరా సినిమాల్లో మిస్ అయ్యాయి. ఇప్ప‌టికే సాహో భారీ న‌ష్టాలు మిగిల్చి వెళ్లిపోయింది. హిందీ ఆదుకోక‌పోతే సాహో ప‌రిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఇక ఇప్పుడు సైరా సైతం అదేబాట‌లో న‌డిచేలా ఉంది. సో నేల విచిడి సాము చేస్తే ఏం జ‌రుగుతుందో ? ఈ రెండు సినిమాల‌తో అయినా మ‌న తెలుగు సినిమా మేక‌ర్స్‌కు తెలిసొచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: