కొన్ని సినిమాలు వంద కోట్లను కొల్లగొట్టడానికి నానా తంటాలు పడితే.. బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్ సినిమా మాత్రం అవలీలగా వసూళు చేస్తుంది.  కథాకథానలతో సంబంధం లేకుండా తీసిన ప్రతీ సినిమా వందకోట్లను కలెక్ట్ చేస్తు ఎదురులేకుండా దూసుకుపోతుడు సల్మాన్.
 
అసలు  సల్మాన్ సినిమా అంటేనే తక్కువలో తక్కువ కనీసం వందకోట్లు ఐన కలెక్ట్ చేస్తుందని తెలిసిందే. 
 
 
వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాను హిట్ అని అంటాం.. కానీ సల్మాన్ ఖాన్ చిత్రాల విషయంలో ఆ లెక్క వేరు. ఎందుకంటె ఈ మధ్య దాదాపు తొమ్మిది చిత్రాలు వరుసగా వంద కోట్లను కలెక్ట్ చేసి తిరుగులేని రికార్డులను క్రియేట్ చేశాడు.  అయితే ఆ మధ్య వచ్చని ట్యూబ్ లైట్ చిత్రంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందె. ఇదే విషయాన్ని సల్మాన్ ముందు ప్రస్తావించగా.. వందకోట్లను దాటేసిన సినిమాను ఫ్లాప్ అని ఎలా అంటారని సల్మాన్ తిరిగి ప్రశ్నించాడు.
 
ఎందుకంటె సల్మాన్ తెరపై కనిపిస్తే చాలు.. వందకోట్లు అనేవి మినిమమ్ కలెక్షన్  అనేలా ఖాన్ త్రయం నడుస్తుంది.  స్వతంత్ర్యం రాక పూర్వం నుంచి ప్రస్తుతం వరకు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కల్పిత చిత్రంలో సల్మాన్ విభిన్న పాత్రలను పోషించాడు. కానీ ఈ మూవీ రిలీజై.. అంచనాలు అందుకోలేకపోయినా ...... రికార్డు కలెక్షన్లను సాధించింది.మా సల్లూ భాయ్ స్టామినా ఇది అని  సల్మాన్ అభిమానులు కాలర్ ఎగరేశారు.
 
ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ దబాంగ్3 మూవీని  అద్భుతంగా తెరకెక్కించినట్లు సమాచారం. అయితే తాజాగా రిలీజ్ చేసిన దబాంగ్3 టీజర్ ఎంత వైరల్ అయిందో అందరం చూశాం. చుల్ బుల్ పాండేగా సల్మాన్.. మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నాడు.సినిమా నాది.. పోస్టర్ నాది.. ప్రమోషన్ కూడా నేనే చేయాలి కదా అంటూ ఓ టీజర్ ను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: