తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్  నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బిగిల్' షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లోని  రామకృష్ణ బీచ్ లో జరుగుతుంది. ఈషూటింగ్ లో  విజయ్ కూడా పాల్గొంటున్నాడు.  నేటితో ఈ షూటింగ్ పూర్తి కానుంది.  అట్లీ డైరెక్షన్ లో  స్పోర్ట్స్  డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్  డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈఏడాది సౌత్ లో చివరగా  విడుదలకానున్న  పెద్ద సినిమా ఇదే.  దాంతో ఈ చిత్రంఫై  తమిళ , తెలుగు భాషల్లో మంచి అంచనాలు వున్నాయి. అందుకు తగ్గట్లే  తమిళనాడు లో ఈచిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కొత్త రికార్డులను సృష్టిస్తుంది.  ఇక ఈ చిత్రం యొక్క తెలుగు థియేట్రికల్ హక్కులను  8కోట్లకు  నిర్మాత  మహేష్ ఎస్ కోనేరు  గట్టి పోటీ నడుమ దక్కించుకున్నారు. గత ఏడాది విజయ్ నటించిన సర్కార్  తెలుగులో కూడా  సూపర్ హిట్ కావడంతో  తెలుగు రాష్ట్రాల్లో బిగిల్ ను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు  ఆసక్తి చూపిస్తున్నారు.  అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ , తెలంగాణలో ఈ చిత్రం 10కోట్ల వరకు ప్రీరిలీజ్  బిజినెస్ చేసింది. అలాగే ఈ చిత్రాన్ని  400స్క్రీన్లలో విడుదలచేనున్నారు.  ఈ సినిమాతో  విజయ్ మార్కెట్  విస్తరించనుంది.


 

భారీ బడ్జెట్ తో  ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నాడు.  ఈచిత్రం దీపావళి కానుకగా  అక్టోబర్ 24 న లేదా  25 న కానీ  విడుదలకానుంది.  ఇక   విజయ్ -అట్లీ కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం. గతంలో  వీరి కాంబినేషన్ లో వచ్చిన  తెరి , మెర్సల్  సూపర్ హిట్లు అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: