మెగాస్టార్ చిరంజీవి మరియు స్టార్ హీరోయిన్ నయనతారల కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా సైరా నరసింహారెడ్డి నేడు విపరీతమైన అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయడం జరిగింది. పలువురు టాలీవుడ్ మరియు ఇతర భాషల నటులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతాన్ని అందించగా, 

ప్రముఖ ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఫోటోగ్రఫీని అందించడం జరిగింది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ని స్మపాదించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, నరసింహారెడ్డి గారి పాత్రలో నటించారు అనడం కంటే, జీవించారని అంటున్నారు మెజారిటీ ప్రేక్షకులు. ఇక విజువల్ గా సినిమా ఎంతో బాగుందని, అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అదిరిపోయాయని చెప్తున్నారు. అయితే సినిమాకు ప్రధాన మైనస్, రన్ టైం అని, అది కొంచెం తగ్గించి ఉంటె బాగుండేదని కూడా చెప్తున్నారు. ఇక పూర్తిగా స్వాతంత్రోద్యమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషన్స్, ఫైట్స్, సెంటిమెంట్ వంటి వాటికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందని, అయితే ప్రేక్షకుడికి అవసరమైన ఎంటర్టైన్మెంట్ ని అందించే ముఖ్యమైన కమర్షియల్ అంశాలు పూర్తిగా మిస్ అయ్యాయని అంటున్నారు. 

అటువంటి ఎంటర్టైన్మెంట్ ని ఆశించి థియేటర్ కు వెళ్లే ప్రేక్షకుడికి నిరాశ తప్పదని తెలుస్తోంది. ఇక ఫస్ట్ హాఫ్ పెద్దగా ఆసక్తికరంగా సాగదని, అలానే సెకండ్ హాఫ్ లో కూడా కొంత ల్యాగ్ ఉందని చెప్తున్నారు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ పర్వాలేదనిపించిందని, తనకు వచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని అతడు ఇంకా బాగా వినియోగించుకుంటే బాగుండేదని అంటున్నారు. మొత్తంగా ఈ సినిమా ఒక యావేరేజ్ సినిమాగా నిలిచే అవకాశాలు గట్టిగా కనపడుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో మరి ఎంత మేర కలెక్షన్ ని ఈ సినిమా రాబడుతుందో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: