మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి చారిత్రాత్మక సినిమాల్లో నటించాలని అనుకున్న‌ప్పుడు ఈ సినిమాకు దర్శకుడిగా ఎవరిని ? ఎంపిక చేసుకోవాలా అన్న ప్రశ్న ? తలెత్తినపుడు చాలా మంది పేర్లు ఆలోచించారు. రాజమౌళి తన సినిమా వ్యవహారాల్లో తాను బిజీగా ఉన్నారు... వినాయక్ ఫామ్‌లో లేడు. ఖైదీ నెంబర్ 150 సినిమా అంతంతమాత్రంగానే ఆడింది. చివరికి రామ్ చరణ్ కు ధృవ‌తో హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి చిరు మదిలో మెదిలాడు. వెంటనే చిరు సురేందర్ రెడ్డికి కబురు పంపి సైరా సినిమాకు దర్శకత్వం వహించాలని కోరారు.


సురేందర్ రెడ్డి సైరా కోసం పరుచూరి బ్రదర్స్ రాసిన కథను కాదని తనకు తానుగా మరో కొత్త కథ వండి తెచ్చి చిరు ముందు పెట్టాడు. ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా ఈ క‌థ ఉంటుందని సురేందర్‌రెడ్డి చెప్పడంతో చిరు సైతం ఓకే చెప్పేశాడు. ఇంకేముంది సినిమా సూపర్ హిట్ అవుతుందని భావించారు.. కానీ వాస్తవంగా చూస్తే సురేందర్‌రెడ్డి మీద చిరుకు ఎందుకు ? నమ్మకం కలిగిందో అర్థం కాని పరిస్థితి.


ఎన్టీఆర్ అశోక్, ఊస‌ర‌వెల్లి సినిమాలకు రెండు సార్లు ఛాన్సిస్తే రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇక మహేష్ బాబు అతిథి సినిమాకు అవకాశం ఉండగా దానిని సైతం సురేందర్ ఫెయిల్ చేసేశాడు. సురేందర్ రెడ్డికి లైఫ్ ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్ కిక్ 2 సినిమాతో ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. మ‌ధ్య‌లో రేసుగుర్రం ఒక్కటి మాత్రమే హిట్ అవ్వగా.. ధృవ సినిమా సైతం రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సురేంద‌ర్‌రెడ్డి అనుభ‌వ లేమి సైరాలో అడుగ‌డుగునా క‌నిపించింది. కేవ‌లం హీరోయిజం ఎలివేట్ చేస్తూ క‌థ‌, క‌థ‌నాలు సూటిగా చెప్ప‌లేక ఆప‌సోపాలు ప‌డ్డాడు.


చివ‌ర‌కు చ‌రిత్ర సైతం వ‌క్రీక‌రించేశాడు. చిన్న పాలెగాడుని ఓ పెద్ద చ‌క్ర‌వ‌ర్తి అనే త‌ర‌హాలో సినిమా యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేశాడు. సైరా చేసిన గెరిల్లా యుద్ధాలు మార్చేసి ఇక్క‌డ ఊచ‌కోత పెట్టేశాడు. ఓవ‌రాల్‌గా చిరు త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కం వ‌మ్ము చేశాడు. మ‌ధ్య‌లో రేసుగుర్రం కూడా అత‌డికి గాలివాటం హిట్ అన్న‌ది ఈ సినిమా క్లీయ‌ర్‌గా చెప్పేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: