మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన తాజా సినిమా సైరా నరసింహారెడ్డి. రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ సరసన తొలిసారి నయనతార హీరోయిన్ గా జోడి కట్టిన ఈ సినిమాలో అనుష్క, తమన్నా, నిహారిక కొణిదెల ఇతర పాత్రల్లో నటించగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నరసింహారెడ్డి గురుపాత్రైన గోసాయి వెంకన్న పాత్రలో నటించడం జరిగింది. 

ఇకపోతే టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు మరియు కన్నడ నటుడు సుదీప్, అలానే తమిళ నటుడు విజయ్ సేతుపతిలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందించడం జరిగింది .ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, కొంత మిశ్రమ ఫలితాన్ని దక్కించుకుంది. ఇక సినిమాలో మెగాస్టార్ పెర్ఫార్మన్స్ పై సర్వత్రా ప్రశంశలు కురుస్తున్నప్పటికీ, దర్శకుడు సురేందర్ రెడ్డి, సినిమాను అనుకున్న స్థాయిలో తెరకెక్కించలేదని అంటున్నారు. మధ్యలో అక్కడక్కడా సాగతీతగా అనిపించే ఈ సినిమాకు లెంగ్త్ పరంగా పెద్ద అడ్డంకి ఎదురైందని, 

అలానే ఫస్ట్ హాఫ్ కూడా అంత ఆకట్టుకునేలా లేదని మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా పర్వాలేదనిపించిందని, అయితే ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకు మంచి బలాన్ని అందిస్తాయని చెప్తున్నారు. క్లైమాక్స్ సీన్ లో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంతో భావోద్వేగానికి గురవుతాడని అంటున్నారు. కమర్షియల్ హంగులకు పూర్తి దూరంగా తెరకెక్కిన ఈ సినిమా ఓవర్ అల్ గా యావరేజ్ టాక్ ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి మరింత దృష్టిపెట్టి సినిమాను తీసి ఉంటె, సినిమాకు మరింత మంచి విజయం దక్కి ఉండేదని అంటున్నారు విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: