హాస్య నటుడు వేణు మాధవ్ తో తనకున్న అనుబంధం గురించి ఎన్నో విషయాలను పంచుకున్న రచయిత పరుచూరి గోపాల కృష్ణ వేణు మాధవ్ తనను డ్యాడీ అని పిలిచేవాడని అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే వేణు మాధవ్‌ను తొలిసారి రవీంద్ర భారతిలో  చూసా అని అన్నారు. అప్పుడు స్టేజ్‌పై తనను అనుకరిస్తూ ఉన్నాడు. ఇంతలో నన్ను చూడగానే వేణు మాధవ్‌ స్టేజ్ దిగి వచ్చి నా కాళ్లు పట్టుకున్నాడు.

తనని అనుకరించడం వలన నేనేమన్నా అనుకుంటాడేమోనని వేణు భయపడ్డాడు అని చెప్పుకొచ్చారు. అప్పుడు వేణుకి నచ్చచెప్పి ముందుకు నడవమని చెప్పాను. రావు గోపాల్‌రావు, ఎన్టీఆర్, నాగేశ్వరరావులను ఇమిటేట్ చేయడం చూశాను కానీ నన్ను కూడా ఇమిటేట్ చేస్తారని అనుకోలేదు అని అన్నాను.కానీ చాలా అంటే చాల అద్భుతంగా చేశావు అని చెప్పాను.వేణు మాధవ్  ఇండస్ట్రీలోకి రావడానికి ఎస్వీ కృష్ణారెడ్డి ముఖ్య కారణం.అప్పటిలో  తర్వాత సినిమా ప్రమోషన్స్ కోసం ప్రజల  మధ్యలోకి వెళ్లేవాళ్లం. నాతో పాటు వేణు మాధవ్ కూడా వచ్చేవాడు అని తెలిపాడు.

నాకు ‘వేణు మాధవ్  చనిపోవడానికి ముందు ‘మా’ ఎన్నికల సమయంలో కనిపించాడు. నిజానికి వేణుని చూసి షాక్ అయ్యాను. మనిషి ఎలా ఉన్నాడుఅంటే... ‘ఏంట్రా అలా అయిపోయావ్’ అని అడిగితె అదేంలేదు డ్యాడీ బాగానే ఉన్నాను అని వేణు సమాధానము చెప్పాడు. ఓసారి వేణు మాధవ్‌కి వాళ్ల ఆవిడకు మధ్య ఏదో పెడా  గొడవ జరిగింది. అది సోషల్ మీడియా వర్గాల్లోనూ కూడా చాల  వైరల్ అయింది. ఆ సమయంలో నేను వైజాగ్‌లో ఉన్నాను.

అప్పుడు కొందరు ఆడవాళ్లు నా వద్దకు వచ్చి ‘ఏంటండీ ఇది. మీ అబ్బాయికి మీరైనా చెప్పండి అని సజెస్ట్ చేశారు. భార్యను జాగ్రత్తగా చూసుకోమనండి’ అని కూడా చెప్పారు. అదేంటి నాకు కొడుకులు లేరమ్మా అన్నాను. అప్పుడు తెలిసింది వాళ్లు మాట్లాడేది వేణు మాధవ్ గురించి అని’ అపుడు అర్థం అయంది.


మరింత సమాచారం తెలుసుకోండి: