మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. రు. 280 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కిన సైరా సినిమాపై ఎంత విప‌రీత‌మైన హైప్ ఉందో మ‌నంద‌రం చూశాం. క‌ట్ చేస్తే రిలీజ్ రోజు ఉద‌యానికే సైరా తేలిపోయింది. తెలుగులోనే మిక్స్ డ్ టాక్ న‌డుస్తుంటే ఇత‌ర భాష‌ల్లో ప‌రిస్థితి ఇంకెలా ఉందో అర్థ‌మ‌వుతోంది. 


త‌మిళ్‌లో అయితే సినిమాకు బాగా బ్యాడ్ టాక్ వ‌చ్చేసింది. ఇక మళ‌యాళ జ‌నాలు సైరాను పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టే లేరు. పైగా తెలుగులో ప‌వ‌న్‌క‌ళ్యాన్ వాయిస్ ఓవ‌ర్‌తో సినిమా స్టార్ట్ చేసిన మేక‌ర్స్ త‌మిళ్‌లో క‌మ‌ల్‌ను, మ‌ళ‌యాళంలో మోహ‌న్‌లాల్‌ను వాడుకున్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా అవ‌న్నీ ఓపెనింగ్స్ వ‌ర‌కే ఉంటాయ‌ని.. ఫైన‌ల్‌గా క‌థ‌లో ద‌మ్ముంటేనే సినిమా నిల‌బ‌డుతుంద‌ని... లేక‌పోతే అంతే సంగ‌తులు అని మొన్న సాహో చెప్ప‌క‌నే చెప్పేసింది.


మూవీ పై ఉన్న హైప్ దృష్ట్యా యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ కూడా సైరా ఓకే అనిపించుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 269 లొకేషన్స్ నుండి సైరా $7,39,136 డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఈ ట్రెండ్ కొనసాగితే కేవలం ప్రీమియర్స్ ద్వారానే సైరా వన్ మిలియన్ మార్కు చేరుకునేలా కనబడుతోంది. అయితే ఇక్క‌డితో ఆగిపోతుందా ?  కంటిన్యూ అవుతుందా ? అన్న‌ది చూడాలి. మ‌రోవైపు సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది.


మ‌రి ఓవ‌ర్సీస్ అభిమానులు సైరాను రెండో రోజు నుంచి ప‌ట్టించుకుంటారా ?  లేదా ? అన్న‌ది చూడాలి. ఇక ఈ సినిమాను అక్క‌డ రామ్‌చ‌ర‌ణ్ రు.20 కోట్ల‌కు అమ్మాల‌నుకుని చివ‌ర‌కు రు.15 కోట్ల‌కు బేరం అడి చివ‌ర‌కు రు.10 కోట్ల‌కు మాత్ర‌మే అమ్మాడు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఓవ‌ర్సీస్ బ‌య్య‌ర్లును సైరా ముంచుతుందా ?  లేదా ?  తేల్చుతుందా ? అన్న‌ది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: