మెగా స్టార్ చిరంజీవి సినిమాను ముందుగానే చూడాలన్న ఎంతో ఆసక్తితో చూసిన పోలీస్ అధికారులకు కూడా తిప్పలు తప్పలేదు. చివరికి వారి అభిమానం తమ ఉద్యోగాలను సైతం కోల్పోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే.. చిరంజీవి సినిమా మొదటి షో చూడాలన్న సగటు అభిమానిలాగే ప్రవర్తించిన ఆ ఎస్‌ఐలకు జిల్లా బాస్‌ ఊహించని షాక్‌ ఇచ్చారు. విధుల నిర్వహణలో ఉండగా సినిమా చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ బదిలీ వేటు వేశారు. చిరంజీవి, అమితాబ్ బచ్చన్ కలసి నటించిన సైరా చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర పోరాట కాలంనాటి యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంపై ముందు నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తొలిరోజే సినిమా చూసేయాలని సగటు అభిమానులు ఆశిస్తారు.



కర్నూల్‌ జిల్లాలోని కోవెలకుంట్లలో సైరా నరసింహారెడ్డి బెనిఫిట్‌ షోకు ఆ ఎస్‌ఐలు కూడా అలాంటి ఉత్సుకతతోనే వెళ్లారు. కాకపోతే వారు విధుల్లో ఉండగా ఈ పని చేయడం జిల్లా ఎస్పీకి ఆగ్రహం తెప్పించింది. ఎస్‌ఐల తీరుపై ఎస్పీ పకీరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందున వీఆర్‌కు పంపాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా సైరా ప్రభావంతో హైదరాబాద్ కు చెందిన చిరు అభిమానులులు గాయపడిన సంగతి తెలియసిందే. చింతల్  వాజ్ పెయ్ నగర్లో  సైరా నరసింహారెడ్డి సినిమా బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్ తో ముగ్గురికి తీవ్ర  గాయాలు..స్ధానిక యువకులైన ప్రశాంత్ ( 23),రమేష్ (27)చిరంజీవి ( 30) ఈ రోజు సాయంత్రం వాజ్ పాయ్ నగర్ లోని ఓ భవనానికి ఉన్న సాహో బ్యానర్ తీసి రేపు విడుదల కానున్న 




సైరా నరసింహారెడ్డి సినిమా బ్యానర్ కడుతుండగా విద్యుత్ ఘాతంతో క్రింద పడిన ముగ్గురు యువకులు.బాలానగర్ బి.బి.ఆర్.ఆసుపత్రి కి తరలించిన స్నేహితులు..కేసు నమోదు వేసుకొని దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు. కాగా కర్నూల్ లో ఆరుగురు ఎస్సైలు విఆర్ కు బదిలీ అయ్యారు. చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమాకు వెళ్లిన ఎస్సైలపై కర్నూలు జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. ఈ రోజు వేకువజామున కోవెలకుంట్లలో సైరా సినీమాకు వెళ్లిన ఆరుగురు ఎస్సైలు. విధుల్లో ఉండి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమాకు వెళ్లడటంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే  ఆరుగురు ఎస్సైలను వీఆర్‌కు బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: