ఎన్నో భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ బొమ్మ సిల్వర్ స్క్రీన్లని తాకింది. తెలుగు స్వాంతంత్ర్య సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన సైరా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. అయితే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సైరా సినిమాకు కొంత మిక్సడ్ టాక్ వస్తుంది. సినిమా మొత్తం భారాన్ని చిరంజీవి భుజాల మీద మోసిన.... పరభాషా నటులని కావాలని సినిమాలో ఇరికించే ప్రయత్నం చేశారని అనిపిస్తోంది.


పర బాషా మార్కెట్ పెంచుకోవడం చేసిన ఈ ప్రయత్నం బెడిసికొట్టిందనే అంటున్నారు. ఎందుకంటే సినిమా కథ తెలుగు వ్యక్తిది, లీడ్ రోల్ తెలుగు నటుడు. కానీ కొన్ని సన్నివేశాలని ఆయా ప్రాంతాలకు అనుకూలంగా తీశారు. కన్నడ, తమిళ్, మలయాళం, హింది ఇలా వారి ప్రాంతీయత తెలిసేలా సీన్లు తెరకెక్కించారు. ఇది ఏ మాత్రం తెలుగువారికి నచ్చదు అనే చెప్పాలి.


సైరా కంటే ముందొచ్చిన ప్రభాస్ సాహో సినిమాని అలాగే చేశారు. సాహో సినిమా పూర్తిగా బాలీవుడ్ నేటివిటీకు దగ్గరగా తీశారు. పైగా బాలీవుడ్ నటీనటులని కూడా పెట్టుకున్నారు. దీని వల్ల సినిమా అసలు కథ పక్కకెళ్లి, నటీనటులని హైలైట్ చేయడమే సరిపోయింది. దాని వల్ల సాహో సినిమా తెలుగులో దారుణమైన  పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే బాలీవుడ్ ఓ మోస్తరు విజయాన్ని దక్కించుకుంది.


సాహో మాదిరిగానే సైరాలో కూడా తమిళ్, కన్నడ, బాలీవుడ్ అగ్రనటులని కొన్ని సన్నివేశాల్లో కావాలనే ఇరికించే ప్రయత్నం చేసింది.  తెలుగు సినిమాలో పర బాషా నేటివిటీ రావడమే సాహో, సైరా సినిమాలకు దెబ్బ అని చెప్పాలి. కాకపోతే చిరంజీవి వన్ మ్యాన్ షో...గుర్రపు స్వారీలు, సాహసాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి. మరి సైరా ఫలితం ఎలా ఉంటుందో రెండు మూడు రోజులు ఆగితే గానీ తెలియదు. మొత్తానికైతే సైరా సినిమాని ఓ చప్పటి కిచిడీ చేసేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: