తెలుగు సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ఎనలేని చాల మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ వారసులు అందరూ చిత్రపరిశ్రమలో స్థిరపడి ఉన్నవారే.  మంచు విష్ణు  ..మోహన్ బాబు పెద్ద కుమారుడు. ఈయన 2003లో తన పేరే టైటిల్ గా విష్ణు చిత్రంలో నటించాడు. ఈ చిత్రానికి ఉత్తమ నూతన నటుడిగా విష్ణు కి  ఫిల్మింఫేర్ అవార్డు వచ్చింది అప్పటిలో. విష్ణు  నిర్మాత కూడా. తన తండ్రి ..సీనియర్ నటుడు మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓ గా బాద్యతలు నిర్వహిస్తారు.

విష్ణు నటించిన చిత్రాల్లో ఆయనకి విజయాన్ని ఇచ్చిన చిత్రం  ఢీ ఒకటి మాత్రేమే  ఈ చిత్రంలో జెనీలియాతో కలిసి నటించాడు. ఈ చిత్రంలో శ్రీహరి నటన.. సునీల్.. బ్రహ్మానందం కామెడీ ఈ చిత్ర విజయానికి దోహదపడిందనడంలో సందేహమే లేదు.  ఆ తర్వాత  సూర్యం..పొలిటికల్ రౌడీ..అస్త్రం..గేమ్..కృష్ణార్జున..సలీం..వస్తాడు నా రాజు..దేనికైనా రెడీ..దూసుకెళ్తా..పాండవులు పాండవులు తుమ్మెద..రౌడీ..అనుక్షణం తదితర చిత్రాల్లో నటించినా అవి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

ఇటీవల తాజాగా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఓ సినిమా చేస్తున్నాడు మంచు విష్ణు. ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్పెరీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు నిర్మాణంలోనే తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణుకి చెల్లెలిగా నటి కాజల్‌ అగర్వాల్‌ చేస్తుంది. కాగా  ఈ చిత్రంలో హీరోయిన్ గా  రుహానీ సింగ్‌ జత కట్టననుంది.ఈ చిత్రానికి  ‘కాల్‌ సెంటర్‌’ అనే టైటిల్‌ కూడా పెట్టడం జరిగింది.

 కాగా ఈ చిత్ర  కథ కాల్‌ సెంటర్‌ చుట్టూ తిరుగుతుందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మూవీలో  బాలీవుడ్‌ సీనియర్  నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు అని సమాచారం. ఈ సినిమా ద్వారా సునీల్‌ శెట్టి టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు అని తెలుస్తుంది.గత కొద్దీ కలం నుంచి మాంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణుకు బాలీవుడ్ హీరో ఎంత వరకూ ప్లస్ అవుతాడో చూడాలి మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: