మెగాస్టార్ సైరా న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఇక చ‌రిత్ర గురించి తెలిసిన వారు... అందులోనూ ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి గురించి తెలిసిన వారు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి సైరా సినిమా చూస్తుంటే అడుగ‌డుగునా అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతాయి. ఇది అస‌లు సైరా న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్రా లేక పూర్తిగా వ‌క్రీక‌రించ బ‌డిన క‌ల్పిత కాషాయ గాథా అని ప్రేక్ష‌కులు జుట్టు పీక్కుంటారు. 


ఎంత సినిమా అయినా.. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినా.. మరీ ఇంత ఎగ్జాజరేషన్ అంటే జీర్ణించుకోవడం కష్టమే. ఒక వాస్తవ గాథ సినిమాగా మారినపుడు ప్రేక్షకులు దాన్ని చూసే కోణం వేరు. ఒక కల్పిత కథను చూసేటపుడు వాళ్ల దృష్టికోణం వేరు. ఇక సైరా విష‌యంలో ముందు నుంచి వాస్త‌వ క‌థ అని గ‌ట్టిగా ప్ర‌చారం చేసిన సినిమా మేక‌ర్స్ ఇప్పుడు సినిమాలో అన్ని చాలా ఓవ‌ర్‌గా.. అంటే అతిశ‌యోక్తులే చూపించారు.


మనకు తెలియని చరిత్ర అయితే.. ఎలాగోలా సరిపెట్టుకోవచ్చు. కానీ మ‌న తెలుగు గ‌డ్డ మీద జ‌రిగిన చ‌రిత్ర ఇది. ఇండిపెండెన్స్ మూమెంట్‌కు అత‌డి చ‌రిత్రే నాంది. దేశభక్తితో ముడిపడ్డ కథాంశం అయినపుడు దానికి ఎమోషనల్ గా కనెక్ట్ కాావాలంటే చూస్తున్నది వాస్తవం అనిపించాలి. అయితే సైరాలో ఈ ఓవ‌ర్ ట్రీట్మెంట్ ఎక్కువ అవ్వ‌డంతో వాస్త‌వంగా జ‌రిగిన విష‌యాలు సైతం నిజం కాదు అనేలా తెర‌మీద ఉన్నాయి.


బాహుబ‌లిని చూసి అంతే భారీత‌నంతో తెర‌కెక్కించాల‌న్న త‌ప‌న అడుగ‌డుగునా క‌న‌ప‌డ‌డంతో సైరాలో వాస్త‌వ క‌థ తెర వెన‌క్కు వెళ్లిపోయి పూర్తిగా కృతిమ క‌థ తెర‌మీద‌కు వ‌చ్చేసింది. ఏదేమైనా చ‌రిత్ర‌కు మ‌సాలా అద్ద‌డంతో సైరా పూర్తిగా కంపు కాషాయం అయిపోయింది. ఓ స్వాతంత్య్రోద‌మ్య వీరుడి క‌థ‌ను చెప్పేట‌ప్పుడు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి.. ఎంత జాగ్ర‌త్త‌గా తెర‌కెక్కించాల‌న్న విష‌యంలో క‌నీస అవ‌గాహ‌న లేకుండా ఈ సినిమా తీశారా ? అన్న సందేహాలు కూడా క‌ల‌గ‌క మాన‌వు.


మరింత సమాచారం తెలుసుకోండి: