ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు. ఇంకా చెప్పాలంటే భార‌త‌దేశంలోనే తొలి స్వాతంత్య్ర కాంక్ష‌ను ర‌గిల్చిన ఓ మ‌హోన్న‌త వీరుడు. మ‌రి అలాంటి గొప్ప వీరుడి క‌థ‌ను సినిమ‌గా తెర‌కెక్కించాలంటే సినిమా మేక‌ర్స్ ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి ?  అలాంటి సినిమాను ఎంత గొప్ప‌గా తెర‌కెక్కించాలి... ఈ సినిమా త‌ర‌త‌రాలు గ‌డిచినా తెలుగు జాతి చ‌రిత్ర‌లో నిలిచ‌పోవ‌డంతో పాటు తెలుగు జాతి ఔన్న‌త్యాన్ని ఎప్ప‌ట‌కీ చాటి చెపుతూనే ఉండాలి. 


కానీ ఇప్పుడు సైరా విష‌యంలో ఇందుకు పూర్తిగా రివ‌ర్స్‌లో జ‌రిగింది. ఎన్టీఆర్ న‌టించిన దాన‌వీర శూర క‌ర్ణ సినిమా వ‌చ్చి నాలుగున్న‌ర ద‌శాబ్దాలు అవుతోంది. ఇప్ప‌ట‌కీ ఆ సినిమా తెలుగు జాతి చ‌రిత్ర‌లో ఎప్ప‌ట‌కీ నిలిచిపోయేంత గొప్ప క్లాసిక్‌గా ఉంటుంది. ఆ సినిమాలో డైలాగులు ప్రేక్ష‌కుల నోళ్ల‌ల్లోనూ, సెల్‌ఫోన్స్‌లోనూ మార్మోగుతూనే ఉంటాయి. 


మ‌రి ఇప్పుడు అలాంటి గొప్ప అవ‌కాశం మెగాస్టార్ చిరంజీవికి సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాతో వ‌చ్చింది. కానీ చిరు ఆ అవ‌కాశాన్ని సురేంద‌ర్‌రెడ్డి చేతిలో పెట్ట‌డంతో స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కాస్త ఫ‌క్తు మాస్ మ‌సాలా రెడ్డిగా మారిపోయాడు. ఒక బాహుబలిలా మారి తన సైన్యంతో పదివేల మంది బ్రిటిష్ బలగాన్ని చంపేసినట్లుగా చూపించారు. ఇక ఒక బ్రిటిష్ అధికారిని వెంటాడి వెంటాడి నీటి మడుగులోకి వెళ్లి అతడి ప్రాణం తీసే తీరు అయితే మరీ విడ్డూరం. 


ఇక నరసింహారెడ్డి ఉరి తాడుకు వేలాడుతూ కూడా తన వీరత్వాన్ని చూపించినట్లుగా చిత్రీకరించిన సన్నివేశం అయితే అతిశయోక్తికి పరాకాష్ట అన్నట్లే. ఉరి కొయ్య‌కు వేలాడుతుండ‌గానే రివ‌ర్స్ జంప్ చేసి మ‌రీ త‌ప్పించుకుని ముగ్గురు, న‌లుగురు బ్రిటీషర్ల‌ను చంపుతాడు. త‌న త‌ల తెగినా కూడా ఆ మొండెంతోనే ఇద్ద‌రిని క‌త్తితో పొడిచి చంపేస్తాడు. మ‌రి దీనిని ఎలా పోల్చుకోవాలో మీరే నిర్ణ‌యించుకోండి..?



మరింత సమాచారం తెలుసుకోండి: