బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ , యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన చిత్రం వార్.  భారీ అంచనాల మధ్య  ఈరోజు విడుదలైన ఈ చిత్రం  పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. దాంతో పాటుఈ సినిమా మొదటి రోజు  90 నుండి 100 ఆక్యుపెన్సీ తో రన్ కావడంతో భారీ ఓపెనింగ్ ను రాబట్టుకోనుంది.  ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు దేశ వ్యాప్తంగా 35-40కోట్ల షేర్ ను రాబడుతుందని సమాచారం. అదే జరిగితే  ఈ ఏడాది బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్ ను రాబట్టిన చిత్రంగా  వార్ రికార్డు క్రియేట్ చేయనుంది. సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు హృతిక్ , టైగర్ లు చాలా ప్లస్ అయ్యారు. వీరిద్దరి  పిజిక్ కు తగ్గట్లు  డిసైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు  సినిమాలో హైలైట్ అయ్యాయి.  మాములుగానే బాలీవుడ్ ప్రేక్షకులు యాక్షన్ సినిమాలను  ఎక్కువగా  ఇష్ట పడుతారు . ఇటీవల ప్రభాస్ నటించిన  సాహోనే అందుకు మంచి ఉదాహారణ.   ప్లాప్ టాక్ తో ఈ చిత్రం  అక్కడ 154కోట్ల షేర్ ను రాబట్టిందంటే హిట్ టాక్ తో 300కోట్లు రాబట్టడం వార్ కు  పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. 



ఇక ఈ సినిమాతో పాటు మచ్ అవైటెడ్ మూవీగా  విడుదలైన సైరా కూడా  అక్కడ పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది.   అయితే వార్ కు పాజిటివ్ టాక్ రావడంతో  సైరాను  ఎంతవరకు ఆదిరేస్తారనేది ఆసక్తిగా మారింది.  మరి సైరా హిందీ వెర్షన్ వార్ ను తట్టుకొని  ఫుల్ రన్ లో ఏ  రేంజ్ లో వసూళ్లను రాబడుతుందో చూడాలి. ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో మాత్రం వార్ , సైరా కు దరిదాపుల్లో కూడా రాలేకపోతుంది. దాంతో వార్ అక్కడ డిజాస్టర్  అయ్యేలాగే వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: