టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి నిన్న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, దాదాపుగా రూ.250 కోట్లకు పైగా భారీ ఖర్చుతో నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, రత్నవేలు ఫోటోగ్రఫీ ని, అలానే బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందించడం జరిగింది. తొలి తరం రాయలసీమ ప్రాంతానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. 

ఇకపోతే భారీ సాంకేతిక విలువలతో, అలానే పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం వంటి భాషల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక నిన్న, ఎన్నో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై మెజారిటీ ప్రేక్షకులు మిశ్రమ స్పందనను వ్యక్తపరుస్తున్నారు. నిజానికి ఒక చరిత్రకు సంబందించిన సినిమాను తెరకెక్కించేటపుడు కథను ప్రక్కదారి పట్టించడం వీలుకాదు కాబట్టే దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాను కథానుగుణంగా ఎక్కువగా ఎమోషనల్ గా నడిపినట్లు చెప్తున్నారు. అయితే ఆ విషయం కరెక్ట్ అని, కాకపోతే ప్రేక్షకుల కోణం నుండి కూడా ఆలోచించి, మధ్యలో కొంత ఎంటర్టైన్మెంట్ కు కూడా ప్రాధాన్యత ఇస్తే బాగుండేదని, 

మరీ ముఖ్యంగా లెంగ్త్ కూడా అంత ఎక్కువగా ఉండడం ఈ సినిమాకు కొంత దెబ్బేసిందాని అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన అత్యద్భుత నటనతో సినిమాను తన ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లారని అంటున్నారు. ఆయన పాత్ర యొక్క ఔచిత్యం మరియు ఆయన పలికిన డైలాగ్స్ కు థియేటర్ లో చప్పట్లు ఖాయం అంటున్నారు. అయితే దర్శకుడు మాత్రం స్క్రీన్ ప్లే పై మరింత శ్రద్ధ పెట్టవలసిందని, అందుకే ఓవర్ ఆల్ గా సైరా యావరేజ్ టాక్ సంపాదించగలిగిందని, యూనిట్ కూడా ఇంకొంత అలోచించి ఉంటె బాగుండేదని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంతమేర కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: