గాంధీ జయంతి తో పాటు దసరా సెలవులను ఫుల్ గా క్యాష్ చేసుకోవడానికి సినిమాలు పోటీపడ్డాయి. రెండు భారీ సినిమాలు ఈ వారం విడుదల అయ్యాయి. ఒకటి బహుభాషా సినిమా సైరా నరసింహా రెడ్డి. తెలుగుతో పాటు సైరా తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇలా ఐదు భాషల్లో విడుదలై తొలి రోజున భారీ వసూళ్లను సంపాదించుకునే ప్లాన్ తో ఈ సినిమా విడుదల అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి తో పాటు భారీ తారాగణంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు రివ్యూలు, రేటింగుల విషయంలో తెలుగు మీడియా విషయం పక్కన పెడితే బాలీవుడ్-హిందీ మీడియా కూడా సాహో రేంజ్ లో స్వాగతం చెప్పింది. ఈ సినిమాకు ఒక వైపు నెగిటివ్ తో పాటు పాజిటివ్ రివ్యూలను, పాజిటివ్ రేటింగులను ఇచ్చాయి. 

ఇంగ్లిష్ వార్తా సంస్థల్లోని బాలీవుడ్ సినీ విశ్లేషకులు 'సైరా.. నరసింహారెడ్డి'ని పలు విషయాల్లో ప్రశంసించారు. మంచి రేటింగులు ఇచ్చి, పాజిటివ్ రివ్యూలను ఇచ్చారు. అలాగే కొన్ని చోట్ల విమర్షలు ఎదురయ్యాయి. ఇదే సినిమాతో పాటు బాలీవుడ్ లో 'సైరా'కు గట్టిపోటీ అయిన 'వార్' హీందీలో పాజిటివ్ రేటింగులను పొందకపోవడం ఆశ్చర్యకరం. తెలుగులో సైరా మాదిరిగా 'వార్' కూడా హిందీలో భారీఎత్తున విడుదల అయ్యింది. సౌత్ లోని నగరాల్లో కూడా ఈ సినిమాను భారీ సంఖ్యలోని థియేటర్లలో విడుదల చేశారు.

యూత్ లో మంచి క్రేజ్ కలిగి ఉన్న టైగర్ ష్రాఫ్ , మరో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన ఈ యాక్షన్ సినిమాకు యావరేజ్ రేటింగులే వచ్చాయి. ఇది యాక్షన్ థ్రిల్లరే అని, అనేక ట్విస్టులు  ఆశ్చర్యపరుస్తాయని రివ్యూయర్లు పేర్కొన్నారు. ధూమ్, రేస్ సీరిస్ ల సినిమా వలె ఉందంటూ ఈ సినిమాకు సగం సగం రేటింగులను ఇచ్చారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు. ఈ రకంగా సైరాకు బాలీవుడ్ లో వార్ గట్టి పోటీ ఇచ్చి తొక్కేస్తుందనుకుంటే సీన్ రివర్స్ అయిందని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా చూస్తే అమితాబ్ తప్ప సైరాలో బాలీవుడ్ స్టార్ హీరోలు మరెవరు లేరు. అయినా హృతిక్ టైగర్ ష్రాఫ్ కలిసి వార్ ని గట్టెక్కించలేకపోయారన్న కామెంట్స్ కూడా బాగానే వినపడుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: