టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ‘రాజా ది గ్రేట్’ అనే ప్రయోగాత్మక సినిమా చేసి అదిరిపోయే హిట్ అందుకున్న రవితేజ తర్వాత వరుస సినిమాలు ఒప్పుకొని చేతులు కాల్చుకోవడం జరిగింది. దీంతో గతంలో తనకు పోలీస్ పాత్ర లో విక్రమార్కుడు సినిమా తో అదిరిపోయే హిట్టు అందుకున్న రవితేజ...తాజాగా అదే పాత్రలో రవితేజ సినిమా చేస్తున్నట్టు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం గతంలో డాన్ శీను, బలుపు రెండు బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో రవితేజ  పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.


ఈ సినిమాలో రవితేజ పక్కన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ అదిరిపోయే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినబడుతోంది. ఇప్పటికే ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘పవర్’, ‘టచ్ చేసి చూడు’ వంటి చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించి సింహభాగం విజయాలు అందుకున్న రవితేజ… మ‌రోసారి తనకి అచ్చొచ్చిన పాత్రలో ఏ స్థాయిలో రంజింప‌జేస్తాడో చూడాలి. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా అనే సినిమా చేస్తున్నాడు.


విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. క్రిస్మస్ పండుగ సీజన్లో డిసెంబర్ 20వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. గతంలో పోలీస్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటించిన చాలా సినిమాలలో విక్రమార్కుడు బీభత్సమైన హిట్ అందుకున్న ఈ విషయం అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఏ స్థాయి హిట్ అందుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: