సైరా నరసింహారెడ్డి సినిమా ఈ ఉదయం ప్రపంచంలోని చాలా దేశాల్లో రిలీజ్ అయ్యింది.  మంచి టాక్ వచ్చింది.  కలెక్షన్ల పరంగా పర్వాలేదు.  అయితే సినిమాకు అనుకున్నట్టుగా భారీ టాక్ రాకపోవడంతో సినిమాకు పెద్దగా వసూళ్లు రావడం కష్టమే.  పైగా ఈ మూవీని దాదాపుగా 270 కోట్ల రూపాయలతో నిర్మించారు.  లాభాలు రావాలి అంటే సైరా కనీసం 350 కోట్ల రూపాయలు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది.  సినిమా పరంగా చూసుకుంటే పెద్దగా లేదని అంటున్నారు.  


ఈ సమయంలో సైరాకు ఆ స్థాయిలో కలెక్షన్లు వస్తాయా అన్నది సందేహంగా మారింది.  సైరా సైనా అంటే ఆహా ఓహో అనే విధంగా ఉంటుందని అంచనా వేశారు.  ఎక్కడో చిన్న చిన్న లోపాలు జరగటం వలన సినిమాకు కలిసిరాలేదు. ఉదయం వరకు పర్వాలేదని అన్నా, మధ్యాహ్నం, సాయంత్రం అయ్యే సరికి టాక్ మారిపోయింది.  యావరేజ్ టాక్ కు వచ్చింది.  


యావరేజ్ టాక్ కంటిన్యూ అయితే, సినిమా ఇబ్బందులు పడే అవాకాశం ఉంది.  ఇప్పుడు సైరాకు మరో రూపంలో ముప్పు వచ్చింది.  అదే తమిళ్ రాకర్స్.  సినిమా రిలీజయ్యి.. ఫస్ట్ షో పూర్తైన వెంటనే తమిళ్ రాకర్స్ లో హెచ్ డి ప్రింట్ తో కూడిన సినిమాను పెట్టారు.  దీంతో సైరా టీమ్ షాక్ అయ్యింది.  వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. చాలా వరకు లింకులను తొలగించింది సైరా యూనిట్.  


పైరసీని ప్రోత్సహించవద్దని చెప్పినా.. పైరసీ ఆగడం లేదు.  ఎక్కడో ఒక చోట నుంచి పైరసీ భూతం పుట్టుకొస్తూనే ఉన్నది.  ఇక పైరసీని అరికట్టాలని కొత్త కొత్త టెక్నాలజీని తీసుకొచ్చినా దానికి విరుగుడు ను పైరసీ దారులు తయారు చేసుకొని రెడీగా ఉంటున్నారు.  వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసినా క్షణాల్లో నెట్ లో పైరసీ భూతం కోరలు చాచి కాటేస్తోంది.  దీంతో కలెక్షన్లు ఢమాల్ అని పడిపోతున్నాయి.  సైరా విషయంలోనూ అదే జరిగేలా ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: