సూపర్ స్టార్  రజినీకాంత్  నటించిన పేట సినిమాలో  ఓ కీలక పాత్రలో నటించి సౌత్ ఇండస్ట్రీ కి పరిచయమైంది హాట్ బ్యూటీ  మాళవిక మోహనన్.  ఈసినిమా  తరువాత  మాళవిక కు సెన్సేషనల్  హీరో విజయ్ దేవరకొండ తో 'హీరో' లో హీరోయిన్ గా నటించే ఆఫర్ వచ్చింది.  ఇటీవలే ఈ చిత్రం ఓ  షెడ్యూల్ ను కూడా  పూర్తి చేసుకుంది అయితే  ఏమైందో ఏమో ఈ సినిమాను మేకర్స్ ప్రస్తుతం హోల్డ్ లో పెట్టారు. 



దాంతో  మాళవికకు మళ్ళీ ఆఫర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి  వచ్చింది..  అలా గని కాలిగా ఉండకుండా ఆమె  హాట్ ఫోటో షూట్ లతో గత కొద్దీ రోజులనుండి  హడావిడి చేసింది. ఆ ఫోటోలు కాస్త నెట్ లో  వైరల్ అయ్యాయి.   ఇక ఆఫొటోల్లో  మాళవిక గ్లామర్ ను చూసి మేకర్స్ అవకాశాలు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. అందులో భాగంగా తాజాగా ఓ క్రేజీ ఆఫర్ ను పట్టేసింది మాళవిక.   కోలీవుడ్ లో ఇళయ దళపతి విజయ్ తో లోకేష్ కనగరాజ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.  ఈచిత్రంలో మాళవిక హీరోయిన్ గా నటించనుంది. ఓరకంగా ఆమె కు ఇది గోల్డెన్ ఛాన్సే.   



పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఈరోజు లాంచ్ కానుండగా  వచ్చే వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.  అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ రోల్లో నటించనున్నాడు. ఎక్స్ బి ఫిలిం క్రెయేటర్స్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది  సమ్మర్ లో  విడుదలకానుంది. ఇక  మాళవికకు తెలుగు నుండి కూడా  ఆఫర్లు కూడా వస్తున్నాయని సమాచారం. త్వరలోనే వాటికీ సంబందించిన  వివరాలు వెలుబడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: