యాక్షన్ హీరో గోపీచంద్ అందాల
తార మెహ్రీన్ జంటగా నటించిన చాణిక్య సినిమా అక్టోబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు ముస్తాబు అవుతుంది. ఈ సినిమా గోపీచంద్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది .ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మరియు ట్రైలర్ లు సినిమా పై అంచనాలను పెంచాయి..ఈ సినిమాలో గోపీచంద్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా చాణిక్య తెరకెక్కుతోంది. చాణిక్య సినిమా కోసం గోపీచంద్ చాలా ప్రమాదకరమైన యాక్షన్ సీక్వెన్స్ లు చేశారు
చాణిక్య నిర్మాత మంచి
బిజినెస్ డీల్ సెట్ చేసారట. తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా బీహర్, మధ్యప్రదేశ్ , ఓడిశా లో తెలుగు యాక్షన్ సినిమా లకు మంచి క్రేజ్ ఉంది . రీసెంట్ గా అజ్ఞాతవాసి సినిమాను హిందీ లోకి డబ్ చేసి ఎవడు 3 గా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు దాదాపుగా 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
అందువల్ల బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు తెలుగు యాక్షన్ సినిమాల రైట్స్ ను సొంతం చేసుకోవడం కోసం ఎంతైన ఖర్చు చేస్తున్నారు. ఈ విషయం తెలుగు నిర్మాతలకు వరంగా మారింది. చాణిక్య సినిమా శాటిలైట్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ దాదాపుగా 15 కోట్లకు అమ్ముడు పోయాయి అంట. హిందీ శాటిలైట్ రైట్స్ 9 కోట్లు , తెలుగు శాటిలైట్ రైట్స్ 4 కోట్లు , డిజిటల్ రైట్స్ 2 కోట్లు మొత్తం 15 కోట్లకు డీల్ సెట్ అయ్యిందంట.బాలీవుడ్ అందాల నటి
జరీన్ ఖాన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. రామ్ సుకంర నిర్మిస్తున్న చాణిక్య సినిమాకి తమిళ దర్శకుడు తిరు దర్శకత్వం వహిస్తున్నాడు.