ఒకప్పుడు కేవలం ప్రాంతీయ సినిమాగా ఉన్న టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది. దేశ సినిమాను శాసించే స్థాయికి వెళ్లింది. బాహుబలి వల్లే అది సాధ్యమైందని తెలిసిందే. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన బాహుబలి మొదటి రెండు పార్టులు తెలుగు సినిమా స్టామినాను ప్రూవ్ చేసింది.


ఇక ఆ తర్వాత తెలుగు సినిమాల మీద బాలీవుడ్ కన్ను పడ్డది. అయినా సరే సినిమా సినిమాకు బాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాలు వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా వచ్చిన సైరా సినిమా కూడా బాలీవుడ్ మేకర్స్ కు షాక్ ఇచ్చేలా చేసింది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా బుధవారం రిలీజై సక్సెస్ అందుకుంది.


పిరియాడికల్ మూవీస్ తీయడంలో తెలుగు పరిశ్రమ తర్వాతే ఎవరైనా అనేంతలా సినిమాలు వస్తున్నాయి. బాలీవుడ్ మేకర్స్ కూడా తెలుగు సినిమా అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. కంటెంట్ క్లారిటీ మన దగ్గర బాగా ఉంటుంది. అందుకే ఇలాంటి సినిమాలకు హిందిలో మంచి మార్కెట్ జరుగుతుంది.


ఒకప్పుడు బాలీవుడ్ సినిమా నెక్స్ట్ లెవల్ మూవీస్ అనేవారు. కాని ఇప్పుడు వారిని కూడా ఆశ్చర్యపరుస్తూ తెలుగు సినిమాలు వస్తున్నాయి. సైరా సినిమాపై తెలుగులో కొంతమంది డివైడ్ టాక్ చెబుతున్నారు కాని బాలీవుడ్ మీడియా మాత్రం సైరా సూపర్ హిట్ అనేస్తున్నారు. మొత్తానికి తెలుగు సినిమా పవర్ ఏంటో మరోసారి సైరాతో ప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలో రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా మరో సంచలనంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై కూడా బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఇక మీదట వచ్చే తెలుగు పిరియాడికల్ మూవీస్ కూడా ఇలానే సత్తా చాటాలని ఆశిద్దాం.    




మరింత సమాచారం తెలుసుకోండి: