చరిత్ర చాటున కనుమరుగైన,భారతదేశంలోని,తెలుగు నేలకు చెందిన మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రను సైరా సినిమా గా తీసుకొచ్చారు దర్శకుడు సురెందర్ రెడ్డి,కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి,అమితాబ్ బచ్చన్, తమన్నా,నయనతార,విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్,జగపతి బాబు కీలక పత్రాలు పోషించారు.



ఇక సైరాకు సంబంధించిన ఎన్నో అప్‌డేట్స్ ద్వారా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసుకున్నారు చిత్రయూనిట్.ఇకపోతే ఈ సినిమాకు మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి కోసమే.మెగాస్టార్ అభిమానులు చిరును ఇప్పటి వరకు ఇన్ని దశాబ్దాల కాలంలో చూడని ఒక సరికొత్త పాత్రలో మెగాస్టార్ కనబర్చిన నటనా తీరును భేరీజు వెయ్యడానికి మాటలు సరిపోవు.ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన రత్నవేలుకు సౌత్ లో అద్భుతమైన క్రేజ్ ఉంది.సినీ పరిశ్రమలో అద్భుతమైన సినిమాటోగ్రాఫర్లలో రత్నవేలు ఒకరని చెప్పవచ్చూ.



ఇక శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో,వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నంబర్ 150,సుకుమార్‌తో ఆర్య,1 నేనొక్కడినే, కుమారి 21ఎఫ్ సినిమాలతో పాటుగా గత ఏడాది విడుదలైన రంగస్థలం చిత్రానికి కూడా ఆయనే సినిమాటోగ్రఫీ అందించారు, సుకుమార్ దర్శకత్వం,చరణ్ నటన,సమంత హావభావాలతో పాటు రత్నవేలు సినిమాటోగ్రఫీ పనితీరును కూడా పలువురు మెచ్చుకున్నారు..



మరో విషయమేంటంటే 60 ఏళ్ళు పైబడ్డ మెగాస్టార్ చిరంజీవిగారితో.యాక్షన్ సన్నివేశాలుకు గాని,ఇతరపాత్రలు అన్ని ఆకాలపు పరిస్దితులకు తగ్గట్టుగా కెమెరాలో చిత్రించడం నిజంగా అద్బుతం అనిచెప్పవచ్చూ.ఒకసినిమాకు పెద్దపెద్ద నటినటులుండగానే సరిపోదు,ఇంతేగాకుండా డైరెక్షన్,సంగీతం,అద్భుతమైన గ్రాఫిక్స్ ఉంటే హిట్ అవ్వదు. కెమెరా పనితనం కూడా బాగుంటే నే ఆ సినిమాకు న్యాయంజరిగినట్లు.బహుశా మరోసారి రత్నవేలు సైరా సినిమాతో తనలోవున్న స్టామినా చూపించాడను కుంటున్నారు సినీ జనాలు..

మరింత సమాచారం తెలుసుకోండి: