‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ను వాడుకున్నందుకు మెగా అభిమానులకు నానీ పై విపరీతమైన కోపం వచ్చింది. ఆ మూవీ చెప్పుకోతగ్గ స్థాయిలో సక్సస్ కాకపోయినా నాని అనవసరంగా మెగా అభిమానులకు శత్రువుగా మారిపోయాడు. అయితే ‘సైరా’ తో ఒక అనుకోని అవకాసం తన చేతికి రావడంతో నాని ఒక షాకింగ్ ట్విట్ చేసి తిరిగి మెగా అభిమానుల అభిమానాన్ని పొందడానికి చాల తెలివిగా తనవంతు ప్రయత్నాలు చేసాడు.

ప్రస్తుతం నాని దక్షిణ కొరియాలో తన ‘వి’ షూటింగ్ బ్రేక్ తీసుకుని అక్కడ హాలిడేని ఎంజాయ్ చేస్తున్నాడు. మెగా స్టార్ చిరంజీవి అభిమానిగా చెప్పుకునే నాని ‘సైరా’ మూవీని చూడాలని ప్రయత్నించినా చూడలేకపోయాడు. దీనికి కారణం దక్షిణ కొరియాలో ఈ మూవీ విడుదల కాలేదు. 

దీనితో తాను ‘సైరా’ చూడలేకపోయాను అంటూ బాథపడి ఒక ట్విట్ చేయడమే కాకుండా ఆ ట్విట్ లో ‘సైరా’ పోస్టర్ పక్కన తన ఫోటోను కూడ జత చేసి ఒక షాకింగ్ ట్విట్ చేసాడు. ‘దక్షిణ కొరియాలో చిక్కుకు పోవడంతో ‘సైరా’ ను చూసే మార్గం లేదు. అయితే సైరా టాక్ వినపడుతోంది. ఇండియాలో బాక్స్ ఆఫీసు గంట మోగుతోంది.

ఘరానామొగుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. చిరంజీవి గారిని ఇక్కడ నుంచే కౌగలించుకుంటున్నా’ అంటూ ట్విట్ చేసి తన అభిమానాన్ని భక్తిని చాటుకున్నాడు.
ప్రస్తుతం నాని సినిమాలకు టాక్ బాగా వస్తున్నా కలక్షన్స్ విషయంలో నిలబడలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో తిరిగి అందరి హీరోల అభిమానాన్ని ముఖ్యంగా మెగా అభిమానుల ఆదరణను పొందడానికి నాని ఇలా వ్యూహాత్మకంగా ట్విట్ చేసాడా అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. నాని చేసిన ట్విట్ చూసి మెగా అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోవడమే కాకుండా నాని పై ఏర్పరుచుకున్న తమ అసహనాన్ని పోగొట్టుకున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: