‘సైరా’ గురించి మీడియాలో వస్తున్న కామెంట్స్ మరియు రివ్యూలలో చిరంజీవితో సమానంగా తమన్నా పై ప్రశంసలు రావడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఈ మూవీలో నర్తకి గా ఒక విభిన్నమైన పాత్రను తమన్నా పోషించింది. తమన్నా చిరంజీవిల పై కొన్ని రొమాంటిక్ సీన్స్ ఎబ్బెట్టుగా ఉన్నట్లు కామెంట్స్ కూడ వచ్చాయి. 

అయితే అనూహ్యంగా ఈ మూవీ కథలో తమన్నా పాత్రకు విపరీతమైన ప్రాధాన్యత లభించడమే కాకుండా ఆమె నటనకు విమర్శకుల నుండి సాధారణ ప్రేక్షుడి వరకు ప్రశంసలు అందుతున్నాయి. ఈ మూవీలో లక్ష్మి పాత్రలో కనిపించిన తమన్నా డాన్సర్ గా చిరంజీవిని ఆరాధించే ప్రేమికురాలుగా ఆపై ఒక ఫైటర్ గా మూడు షెడ్స్ లో ఆమె పాత్ర కనిపిస్తూ తమన్నా మంచి నటనను ప్రదర్శించింది అన్న ప్రశంసలు వస్తున్నాయి. 

వాస్తవానికి ఈ ఏడాది వచ్చిన ‘ఎఫ్ 2’ సక్సస్ అయినా ఆమెకు చెప్పుకోతగ్గ అవకాశాలు రాని పరిస్థితులలో ఆమె తన పారితోషికాన్ని కూడ తగ్గించుకుంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ మూవీలో పేరుకు తమన్నా సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ సాధారణ ప్రేక్షకులు నయనతార పాత్ర కంటే తమన్నా పాత్రకు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు.

దీనికితోడు ఈమూవీ ప్రమోషన్ గురించి నయనతార ఏమాత్రం పట్టించుకోక పోవడంతో చిరంజీవితో సమానంగా తమన్నా దేశవ్యాప్తంగా టూర్ చేస్తూ మీడియా దృష్టిలో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్స్ కొరత కొనసాగుతున్న పరిస్థితి నయనతార ఇగో లాంటి పరిస్థితులలో రానున్న రోజులలో తమన్నాకు ఇంకా చాల మంచి అవకాశాలు సీనియర్ హీరోల సినిమాలలో వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీనితో నయనతార ఇగో తమన్నాకు ఊహించని అదృష్టంగా మారింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే ‘బాహుబలి’ ఇవ్వలేని అదృష్టం ‘సైరా’ తమన్నాకు ఇచ్చింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: