తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.  పునాధిరాళ్లతో సినీ పరిశ్రమలో పునాధి వేసిన మెగాస్టార్ చిరంజీవి ఇంతింతై వటుడింతై అన్న చందంగా స్వయంకృషితో ఎదిగి అప్పట్లో తెలుగు దిగ్గజ హీరోలతో పోటీ పడుతూ సినీ పరిశ్రమలో నూతన వొరవడి తీసుకు వచ్చి..డ్యాన్స్, ఫైట్స్ లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు.  కేవలం హాలీవుడ్, బాలీవుడ్ లోనే మ్యూజిక్, బ్రేక్ డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ లాంటి మూవీకు ప్రాధాన్యత ఉన్న ఆ రోజుల్లో టాలీవుడ్ లో కూడా తాము తక్కువ తినలేదు అన్న విధంగా తన పర్ఫామెన్స్ తో మెప్పించారు చిరంజీవి.  టాలీవుడ్ లో అప్పట్లో మెగాస్టార్ ని బ్రూస్ లీ, మైకేల్ జాక్స్ లా చూసేవారు. 

అయితే మెగాస్టార్ 150 సినిమాలు తీశారు..కానీ అందులో ఒక్కటి కూడా పౌరాణిక, జానపద సినిమాలు లేవు.  అయితే ఇన్నేళ్ల కెరీర్లో ఆయన మనసులో ఎప్పటి నుంచి ఒక మహాయోధుడి సినిమా తీయాలని కోరిక ఉండేదట. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. రేనాటి వీరుడు, బ్రిటీష్ సైన్యాన్ని గజ గజలాడించి ముచ్చెమటలు పట్టించిన వీరుడు...తను శిక్షిస్తారు.. చంపేస్తారని తెలిసినా కూడా ప్రజలకోసం బ్రిటీష్ వారికి లొంగిపోయి ప్రాణాలు అర్పించిన త్యాగధనుడు. అలాంతి గొప్ప వీరుడి సినిమా సెట్స్ పైకి ఎక్కింది.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ సుమారు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కించారు.  నిన్న అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్బంగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది.

రిలీజ్ అయిన అన్ని కేంద్రల్లో మొదటి మిశ్రమ స్పందన వచ్చినా తర్వాత చిరు పర్ఫామెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి యూఎస్ లో భారీ స్థాయిలో విడుదలయ్యింది. ప్రీమియర్ షోలతో సైరా ఈజీగా అనుకున్న టార్గెట్ ఫినిష్ చేసింది. మంగళవారం సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించగా $8,17,0000 వసూళ్లు అందాయి. కెనడాలో $40,122 కలెక్షన్స్ రాబట్టిన సైరా ప్రీమియర్ కలెక్షన్స్ తో $8,57,000 గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. బుధవారం సాయంత్రం సమయానికి $1,45,000 గ్రాస్ కలెక్షన్స్ అందినట్లు సమాచారం. అంతే కాదు ఈ దెబ్బతో 1 మిలియన్ డాలర్స్ ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: