మెగాస్టార్ చిరంజీవి నటించిన పీరియాడికల్ డ్రామా సైరా  నిన్న భారీ అంచనాల మధ్య  తెలుగు తోపాటు  కన్నడ ,మలయాళ , తమిళ , హిందీ  భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే   తెలుగు , కన్నడ లో తప్ప మొదటి రోజు ఈ చిత్రం మిగిలిన భాషల్లో దారుణంగా నిరాశపరించింది.   ముఖ్యంగా  హిందీ ప్రేక్షకులు  అయితే సైరా  కోలుకోలేని షాక్ ఇచ్చారు.  పాజిటివ్ రివ్యూస్  వచ్చిన కూడా అక్కడ   ఈ చిత్రం తొలి రోజు  కేవలం  2కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.  ఇక  ఈచిత్రానికి పోటీగా  విడుదలైన వార్ మాత్రం  వసూళ్ల సునామి సృష్టించింది. మొదటి రోజు ఈచిత్రం దేశ వ్యాప్తంగా  50కోట్ల షేర్ ను రాబట్టి అల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.  హిందీ లో వార్ దాటికి  సైరా పూర్తిగా తేలిపోయింది.  కాగా సైరా అక్కడ 25కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  ఈ కలెక్షన్స్ ఇలాగే ఉంటే మాత్రం ఈచిత్రం అక్కడ  డిజాస్టర్ అవ్వడం పక్క.  ఇక తమిళ , మలయాళ భాషల్లో కూడా ఈచిత్రం కేవలం  లోపే గ్రాస్ వసూళ్లను  రాబట్టి  నిరాశపరిచిందని  సమాచారం. 




మొత్తానికి భారీ హైప్ తో విడుదలైన  ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తుందనుకుంటే మెగా అభిమానులకు షాక్ ఇచ్చింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తొలి తరం  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా  తెరకెక్కిన ఈ చిత్రంలో  నయనతార కథానాయికగా నటించగా  అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు ,  సుధీప్ , తమన్నా  ముఖ్య పాత్రలు పోషించారు. 270కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు

మరింత సమాచారం తెలుసుకోండి: