పవన్ కళ్యాణ్  వెన్నునొప్పి గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తెలుస్తున్న సమాచారం మేరరకు ఒక ప్రముఖ సంస్థ నిర్వహించబోయే కార్యక్రమానికి అతిథిగా రమ్మని పవన్ ను ఆహ్వానించినప్పుడు తాను తన అనారోగ్య సమస్యల వల్ల ఆ సమావేశానికి రాలేను అంటూ ఒక లేఖ ద్వారా తెలియచేయడంతో పవన్ అనారోగ్య వార్తలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ తన అనారోగ్యానికి  సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నా  ఆ సర్జరీ పట్ల ఇష్టం లేకపోవడంతో ప్రకృతి సిద్ధమైన వైద్యానికే మొగ్గుచూపుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ తన ట్విట్టర్ లో మినహా పవన్ ఎక్కడా కనిపించక పోవడంతో జనసేనాని హైదరాబాద్ లో ఉన్నాడా లేకుంటే తన అనారోగ్య సమస్యల నిమిత్తమై ప్రకృతి వైద్యం చేయించుకుంటూ కేరళాలో ఉన్నడా అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. 

నిన్న అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కూడా పవన్ ఎక్కడా కనిపించక పోవడంతో పవన్ అనారోగ్యం పై వస్తున్న వార్తలు అన్ని నిజాలేనా అన్న సందేహాలు చాలా మందికి వస్తున్నాయి. దీనికితోడు ప్రతిరోజు పవన్ పర్సనల్ అకౌంట్ నుంచి ట్విట్టర్ పోస్టింగ్ లు వస్తున్నా ట్విట్టర్ లో పవన్ ఫొటో కనపడి పదిరోజులు దాటిపోవడం మరిన్ని సందేహాలకు తావు ఇస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు పవన్  ఆపరేషన్ పై ఆసక్తి చూపించడం లేదనీ కేవలం కేరళ వైద్యం పై నమ్మకం పెట్టుకున్నాడని అతడి సన్నిహితులనుండి లీకులు వస్తున్నాయి. గత పదిరోజులుగా   ఇద్దరు నిపుణుల పర్యవేక్షణలో పవన్ కి ప్రత్యేక చికిత్స కొనసాగుతున్నట్లు టాక్. వెన్ను నొప్పికి తాత్కాలిక ఉపశమనం కంటే పూర్తిగా నయం కావాలంటే చికిత్స తర్వాత పవన్ కనీసం నెలరోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది అని వైద్యులు చెప్పినట్లు టాక్. దీనితో పవన్ ఆరోగ్యం గురించి ఏదో ఒక ప్రకటన వస్తే బాగుటుంది. ఇలాంటి వార్తలకు చెక్ పడుతుందని పవన్ అభిమానులు భావిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: