ఓ వైపు తెలంగాణాలో బోనాలు......ఆంధ్రలో దసరా వేడుకలు జరుగుతుంటే మెగా ఫామిలీ లో సైరా సంబరాలు జరుగుతున్నాయి. మెగా తండ్రిని హీరోగా పెట్టి....ఓ మెగా కొడుకు నిర్మానించిన సైరా సినిమా మెగా సినిమాగా సూపర్ డూపర్ హిట్ సాధించింది.స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’  చిత్రం.

గాంధీ జయంతి సందర్భంగా నిన్న విడుదలైన ఈ సినిమా  అద్భుతమైన పాజిటివ్‌ టాక్‌ ను సొంతం చేసుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమా విజయంతో చాల కాలం తరువాత  మెగా అభిమానులు పెద్ద ఎత్తున సైరా సంబరాలు జరుపుకుంటున్నారు. ఫాన్స్ లోనే ఇలా ఉంటె ఇంకా  మెగా ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు  ఏ విధంగా వెల్లివిరుస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఈ సందర్భంగా రామ్ చరణ్ తన సంతోషాన్ని ట్విటర్‌ ద్వారా మెగా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ‘మనకు అన్నీ ఇచ్చేసిన వ్యక్తి అని ట్వీట్ చేసాడు. అలాగే  ‘సైరా’తో సూపర్‌ హిట్‌ అందించినందుకు థాంక్యూ డాడి’ అని చిరుకి ధన్యవాదాలు తెలిపారు.


రామ్ చరణ్ నిర్మించిన మొదటి చిత్రం ఇంత ఘన విజయం సాధించడంతో హీరో గానే కాకుండా నిర్మాతగా రామ్ చరన్ తనని తాను నిరూపించుకున్నాడు. మెగా స్టార్ చిరు కొడుకు రామ్‌చరణ్‌ ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ.... ఆలింగనం చేసుకున్న ఫొటోలను ట్విటర్‌ లో పోస్ట్ చేశారు. బిగ్ బి అమితాబ్ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించగా.....సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి ప్రముఖులు ఈ చిత్రంలో నటించారు.


తెలుగుతో పాటు  హిందీ, కన్నడ మరియు తమిళ  భాషల్లో ఈ చిత్రాన్ని విదుదల చేయగా ప్రపంచ వ్యాప్తగా సినీ అభిమానులు  సైరా చూడటానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఈ చిత్రం చూసిన ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేధికగా పోస్టులు పెడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: