బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుల,మతాలను వ్యతిరేకించేవారిలో ఎప్పుడూ ముందుంటారు.ఇక మతం పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని ఆయన ఎప్పుడూ ప్రోత్సహించరు.తాజాగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా అమితాబ్ చేసిన వ్యాఖ్యలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తు న్నాయి.అదేమంటే తన ఇంటి పేరు బచ్చన్‌ అయినప్పటికీ ఆ పేరుకు మతానికి ఎలాంటి సంబంధం లేదని,తన తండ్ర హరివంశ్‌రాయ్ ఎప్పుడూ మతాన్ని ప్రోత్సహించేవారు కాదని పేర్కొన్నారు.



తన అసలు ఇంటి పేరు శ్రీవాస్తవ అయినప్పటికీ ఆ పేరుని తామెప్పుడూ వాడుకోలేదని చెప్పారు.ఇక పోతే తన తండ్రి గురించి చెబుతూ,మా కుటుంబ ఆచారం ప్రకారం హోళీ పండుగ రోజు ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారి కాలికి రంగు పూసి ఆశీర్వాదం తీసుకుంటాం.అలా మా నాన్నగారు తన చుట్టూ ఉన్న జనాలను ఎంతో గౌరవించేవారు.ఓసారి హోళీ పండుగ రోజున మానాన్నా ఇంట్లో టాయ్‌లెట్ క్లీన్ చేసే వ్యక్తికి రంగు పూసి ఆశీర్వాదం తీసుకున్నాక హోళీ సంబరాలు చేసుకున్నారు ’అని వెల్లడించారు. అమితాబ్ ఈ విషయాలు చెబుతున్నప్పుడు షోలోలని ప్రేక్షకులు నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు.



ఇకపోతే అమితాబ్ వీలు దొరికినప్పుడల్లా తన కుటుంబం గురించి,వారు పాటించే సంప్రదాయాల గురించి ఇలా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇక ఆయన వర్క్ విషయానికొస్తే.. ఏడు పదుల వయసులోనూ అమితాబ్ ఎంతో ఉత్సాహంగా వరుస సినిమాలు చేస్తున్నారు.బుధవారం విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో చిరంజీవికి గురువు పాత్రలో ఆయన నటించారు.



ప్రస్తుతం అమితాబ్ ‘గులాబో సితాబో’సినిమాతో బిజీగా ఉన్నారు.ఇక పడిలేచిన కెరటం ఈ బిగ్‌బి అంటూ అమితాబ్ గురించి ముద్దుగా చర్చింటుకుంటారు అభిమానులు.ఇక సైరా సినిమా కోసం అమితాబ్ మెగా కుటుంబం నుంచి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట.అంతేకాదు షూటింగ్‌కి రానుపోను ఫ్లైట్ ఖర్చులు కూడా అడగలేదని రామ్ చరణ్ ఒకానొక సందర్భంలో తెలిపారు. ఇంత మంచి మనసున్న వ్యక్తి కాబట్టే ఈ రోజు ఈ స్ధానంలో ఉన్నారని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: