తెలుగు లో బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో కామెడీ ప్రోగ్రామ్స్,సీరియళ్లు వచ్చాయి. అయితే జబర్ధస్త్ కామెడీ షో వీటీన్నింటిలో బెస్ట్ ప్రోగ్రామ్ గా పేరు తెచ్చుకుంది. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా పరిచయం అయిన యాంకర్స్ అనసూయ, రష్మీలు వెండి తెరపై కూడా మెరిసిపోతున్నారు.  ఇక టాలీవుడ్ లో కమెడియన్లుగా వేణు, తాగుబోతు రమేష్, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర ఇలా ఎంతో మంది కమెడియన్లుగా తమ సత్తా చాటుతున్నారు. జబర్ధస్త్ కామెడీ షో లో లేడీ గెటప్స్ ద్వారా బాగా పాపులర్ అయిన శాంతిస్వరూప్ తర్వాత వినోద్ (వినోదిని) కి మంచి క్రేజ్ ఉంది.

నాగబాబు, రోజాలు జడ్జీ లుగా వ్యవహరిస్తూ.. హాట్ యాంకర్స్ అనసూయ, రేష్మి లు యాంకర్లు గా ఈ కార్యక్రమం మూడు పువ్వులు - ఆరు కాయలుగా నడుస్తుంది. కార్యక్రమం మొదలైన కొన్నాళ్లకు మీడియాలో ఇది హాట్ టాపిక్. ఒక పక్క వల్గారిటీ ఎక్కువైపోతుందని మగాళ్లు ఆడవాళ్లుగా గెటప్స్ వేసి చేసే చిత్రవిచిత్ర వేషాలు అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ వేదికపై లేడీ గెటప్పుల ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో వినోద్ (వినోదిని) ఒకరుగా కనిపిస్తాడు. ఇటీవల కాలంలో ఆయన 'జబర్దస్త్' స్టేజ్ పై కనిపించడం లేదు. దీనికి కారణం అప్పట్లో ఎన్నికల ముందు వైఎస్ జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రలో వినోద్, శాంతి స్వరూప్ లు పాల్గొన్నారు.

జగన్ తరఫున ప్రచారం చేసిన కారణంగానే ఆయనను పక్కన పెట్టేశారనే ప్రచారం జోరుగా జరిగింది. తాజాగా దీనిపై మరోసారి వినోద్ (వినోదిని) స్పందిస్తూ..జగన్ తరఫున ప్రచారం చేసినందుకు కాదు, ఆ సమయంలో ఆ కార్యక్రమం షూటింగుకి తగిన డేట్స్ నేను ఇవ్వలేకపోయాను. జబర్ధస్త్ లో ఆ సమయంలో వేరేవారు లేక టీమ్ చాలా ఇబ్బందులు పడ్డట్లు తెలిసింది. అదే సమయంలో నేను ఓ గొడవలో గాయపడటం .. కొంతకాలం పాటు రెస్టు తీసుకోవలసి రావడం వలన నటించడం కుదరలేదు. నాకూ పూర్తిగా నయం కాగానే వెంటనే 'జబర్దస్త్' వేదికపై కనిపిస్తానని చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: