ప్రపంచ వ్యాపంగా అందరు ఎదురు చుసిన చిరంజీవి తాజా చిత్రం సైరా.. రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవరించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చాలా మంది సీనియర్ నటించిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఫస్ట్ షో కె సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువయ్యాయి. సినిమా కథ ప్రకారం సాగలేదు. న్యాచురల్ గా కథ రాణించలేదనే మాటలు మూట కట్టుకుంది. 


అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కు ఒకవైపు పాజిటివ్ వస్తున్నా, మరో వైపు నెగిటివ్ కామెంట్లు అందుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాను చుసిన సినీ స్టార్స్ అందరు ఈ సినిమాలో చిరంజీవి నటన బాగుందని చిత్రయూనిట్ పై అందరు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాపై మహేష్ బాబు మాట్లాడుతూ సినిమా చాలా బాగుంది. మళ్ళీ చరిత్రను చూసినట్లు ఉందని కొనియాడారు. 


నాని మాత్రం షూటింగ్ కారణంగా సినిమా ను చూడలేక పోయాను. కానీ చిరంజీవిగారు చేశారు అంటే ఇంకా నో డౌట్ సినిమా సూపర్ హిట్ అని అన్నారు. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఘరానా మొగుడు బ్యాక్ అంటూ కామెంట్లు పెట్టారు. దర్శకుడు సంపత్ నంది కూడా తనదైన స్టయిల్లో ఆ చిత్ర యూనిట్ ని పొగడ్తలతో కొనియాడారు. 


ఇకపోతే సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. మామయ్య ఎం చేసిన ఏది సెన్షేషనల్ ఆయన పేరు వింటే చాలు నేను పసిపిల్లాడిని అయిపోతాను. సంతోషం తో కన్నీళ్లు వస్తున్నాయి ఏది ఏమైనా సినిమా హిట్ అయింది. నాకు అదే చాలు అంటూ ట్వీట్ చేసాడు. మెగా వారసుడు వరుణ్ తేజ్ నేను అయన ఫ్యాన్.. ఈ సినిమాలో అయన నటన వర్ణనాతీతం. చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ అని చెప్పారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: