వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఎవరిపై ఏ రకంగా స్పందిస్తాడో తెలీదు. ఎవరిని విమర్శిస్తాడో తెలీదు. మొన్నటికి మొన్న టీచర్స్ డే సందర్భంగా తనకు విద్యా బుద్దులు నేర్పిన గురువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. నిన్నటికి నిన్న దేశమంతా గాంధీ జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న సమయంలో రామ్ గోపాల్ తనలోని గాంధీని నెటిజన్లకు చూపించి హవ్వ అని అనిపించడు. 


వివరాల్లోకి వెళ్తే .. నిన్న గాంధీ జయంతి సందర్బంగా ప్రజలంతా సెలువుని ఎంజాయ్ చేస్తున్న సమయంలో గాంధీ గెటప్‌లో తన ఫోటోను మార్పింగ్‌ చేసుకొని అందరికి షాక్ ఇచ్చాడు. ఆ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ 'గాంధీలో నేను దాగి ఉన్నానని నాకు తెలియదు. హ్యాపీ మై జయంతి' అంటూ ట్విట్ చేశారు. 


మరో ట్విట్ లో నెటిజన్ రాసిన కథను స్క్రీన్ షార్ట్ తీసి పెట్టాడు.. ఆ కామెంట్ ఇదే ‘బ్రిటిష్‌ పాలనలో భారతీయుల బానిసత్వం పోవడానికి పోరాడి భాయతీయ పాలన రాబట్టి స్వాతంత్రం తెచ్చిపెట్టారు అలనాటి గాంధీ. సమరయోధులు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్త్రీ బానిసత్వం పోవడానికి, వాళ్ల విలువల కోసం నిరంతరం కృషి చేస్తున్నవాడు ఒక్క రామ్‌గోపాల్‌ వర్మ మాత్రమే’ అని వర్మ ముదురుని అనే వ్యక్తి చేసిన ట్విట్‌ ‘గోపాల్‌దాస్‌ వరంచంద్‌ రాంధీ’గా చెబుతూ వర్మ మరో ట్వీట్‌ చేశాడు. దీంతో ఈ ట్విట్ నిన్నటి నుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆ ట్విట్ ఏంటో మీరు ఓ లుక్ వేసుకోండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: