చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఒక మెగా అభిమానికి ఎలా ఉంటుందో.. మెగా హీరోలకు కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే వారు హీరోలు కాకముందు నుంచీ చిరు అభిమానులే కాబట్టి. సైరా కోసం సగటు అభిమాని ఎలా ఎదురుచూశారో అందరికీ తెలిసిందే. టీజర్ రిలీజ్ అయి ఏడాది దాటినా.. ఒక్క అప్డేట్ రాకపోయినా దాన్నే చూస్తూ బతికారు. అలాంటి ఎదురుచూపులన్నంటికి తెరపడింది.. సైరా రిలీజ్ అయింది. సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.


ఎన్నో అంచనాల నడుమ.. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ అత్యంత భారీ ఎత్తున విడుదల చేసిన సైరాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అన్నివైపుల నుంచి సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న టాక్ వస్తోంది. ప్రతీ అంశంలోనూ సైరా టాలీవుడ్ స్థాయిని పెంచేలా ఉందంటున్నారు. ఇక దసరా సెలవులను సైరా వాడుకుంటూ.. బాక్సాఫీస్పై కోలుకోలేని యుద్దం చేస్తుందేమో చూడాలి.


అంతా తానై నడిపించిన చిరు.. సైరా సినిమా చూస్తున్నంతసేపు నరసింహారెడ్డిని చూస్తున్నామా? అనేంతగా చిరు ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్లోనూ ఫుల్ జోష్ కనబర్చాడు. వన్ మ్యాన్ షోగా తన భుజాలపై నడిపించాడు. ఇక క్లైమాక్స్ లో చిరు నటన చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే.


సినిమా చూసేందుకు వచ్చిన మెగాహీరో.. గత కొన్ని రోజులుగా గోదావరి అందాల నడుమ తన తదుపరి చిత్రం ప్రతిరోజూ పండగేను తెరకెక్కిస్తున్నారు సాయి ధరమ్ తేజ్. మారుతి దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది. అయితే నిన్నటితో రాజమండ్రి షెడ్యూల్కు గుడ్ బై చెప్పిన సుప్రీం హీరో.. సైరా చూసేంందుకు హైద్రాబాద్ వస్తున్నట్లు తెలిపాడు.


సినిమా చూస్తూ..తనను తాను మరిచిపోయాడట నేను పెద్ద వాడిని అని మరిచిపోయేలా చేసిన ఒకే ఒక్క పేరు చిరంజీవి.. ఆయన్ను చూసే సరికి నా కళ్లలోంచి ఆనంద భాష్పాలు రాలాయి. ఆయన్ను చూసిన క్షణం నేను చిన్న పిల్లవాడిని అయిపోయాను. నేనేవరో మరిచిపోయేలా చేసినందుకు మెగాస్టార్ కు ధన్యవాదాలు.. ధన్యవాదాలు అనేది కొణిదెల ప్రొడక్షన్కు చాలా చిన్న పదమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: