బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ , యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ నిన్న భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. దాంతో ఈ చిత్రం మొదటి రోజు  బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించి హిందీలో అత్యధిక  ఓపెనింగ్ ను రాబట్టిన మొదటి సినిమాగా  అల్ టైం రికార్డు సృష్టించింది.  ఇంతకుముందు ఈ రికార్డు అమీర్ ఖాన్ నటించిన  థగ్స్ అఫ్ హిందుస్థాన్ పేరిట వుండేది.  గత ఏడాది విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు 50కోట్ల షేర్ ను రాబట్టగా  తాజాగా వార్ 52కోట్ల షేర్ తో ఈ రికార్డు ను బద్దలు కొట్టింది.  ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ స్క్రీన్ లలో విడుదలైన కూడా 2కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదనిపించింది. 



ఇదిలా ఉంటే హిందీ లో వార్ , మెగా స్టార్ చిరంజీవి నటించిన సైరా కు  ప్రతికూలంగా మారింది.  సుమారు అక్కడ 1200స్క్రీన్ లలో విడుదలైన  సైరా మొదటి రోజు కేవలం 2.50కోట్ల షేర్ ను మాత్రమే  రాబట్టింది.   పాజిటివ్ టాక్ వచ్చిన కూడా ఈ చిత్రానికి వార్  అడ్డుగోడల నిలవడంతో అంత తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.  అలా కాకుండా సైరా అక్కడ కూడా సోలో గా విడుదలైయ్యుంటే  ఖచ్చితంగా మొదటి రోజు  భారీ వసూళ్లను రాబట్టేదే.  ఇక సైరా  హిందీలో  25కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్  చేసింది. ఒకవేళ  కలెక్షన్స్ గనుక ఇలానే ఉంటే ఈ సినిమా  డిజాస్టర్  అవ్వడం  గ్యారెంటీ.   మరి రానున్న రోజుల్లో నైనా  ఈ చిత్రం అక్కడ మెరుగైన ప్రదర్శన చేస్తుందో  లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: