ఇటీవల విడుదలైన కేజీఎఫ్‌ సినిమా భారీ హిట్ సాధించడం అందరికి తెలిసిందే. కన్నడ నటుడు యష్‌ హీరోగా సినిమాని మంచి తరుణంలో రూపుదిద్దారు.కానీ ఈ సినిమా ఎప్పుడు వివాదంలోనే ఉంది.భారీ హిట్ రావడంతో అందుకు తగ్గట్టుగా రెండో భాగాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు చిత్రయూనిట్‌. కానీ ఆ సమయంలో  ప్రారంభించారో కానీ మొదలు పెట్టిన అప్పటి నుంచి ఏదో ఒకటి  అవాంతరం ఎదురవుతూనే ఉంది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం కేజీఎఫ్‌. ఈ సినిమా ఒక కన్నడలోనే కాదు  తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ ఘనవిజయం సాధించింది.

ఈ సినిమాను మొదటలో  సైనైడ్‌ హిల్స్‌లో షూటింగ్ చేసెందుకు ప్లాన్ చేశారు. కానీ అక్కడి ప్రజలు సినిమా షూటింగ్ కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని షూటింగ్‌ను అడ్డుకోవటంతో ఆ షెడ్యూల్‌ను వాయిదా  కూడా వేశారు.ఆ తరువాత కోర్టును ఆశ్రయించి మరీ సైనైడ్‌ హిల్స్‌లో షూటింగ్‌కు అనుమతి పొందారు.రీసెంట్గా  ఈ సినిమాకు మరోసారి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సినిమాలోని ఓ పాత్ర ఓ నిజజీవిత పాత్రను పోలి ఉండటంతో అతని కుటుంబ సభ్యులు కోర్టును కలిశారు. దీంతో కోర్టు కన్నడ ఫిలిం చాంబర్‌తో పాటు కేజీఎఫ్‌ టీంకు నోటీసులు జారీ చేసింది అని తెలుస్తుంది.

సినిమాలో 1980లలో కరుడుగట్టిన నేరస్తుడిగా పేరున్న తంగం అనే వ్యక్తిని పోలిన పాత్ర కేజీఎఫ్‌లో ఉందంటూ అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేజీఎఫ్‌ తొలి భాగం సమయంలో కూడా తంగ కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ ఆ సమయంలో  విషయం కోర్టు వరకు పోలేదు. కానీ ఇప్పుడు కోర్టు నుంచి నోటీసులు రావటంతో చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో అని సినీ వర్గాలు చుస్తునారు.

యష్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌ పాత్ర పోషిస్తున్నారు.  ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయక పాత్రలో జీవిస్తున్నారు. రవీనాటండన్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. తొలి భాగం సంచలన విజయం సాధించటంతో రెండో భాగాన్ని మరింత భారీగా తెరమీదికి తేవడానికి చాల కృషి చేస్తుంది చిత్ర యూనిట్. మరి ఈ కోర్ట్ విషయం ఏమి అవుతుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: