మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా నిర్మించిన సైరా నిన్న విడుదలై అద్భుత స్పందన దక్కించుకుంది. అటు సాధారణ ప్రేక్షకుల నుండి ఇటు ఫిలిం క్రిటిక్స్ వరకు సైరా చిత్రం పై, చిరు నటనపై మరియు దర్శకుడు సురేంధర్ రెడ్డి టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాంచ‌ర‌ణ్ నిర్మించారు.  ఈ చిత్రం స‌క్సెస్ మీట్‌ను మాదాపూర్ కోహినూర్ హోట‌ల్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో...

డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ... ఈ సినిమా మొద‌లు పెట్టి మూడు సంవ‌త్స‌రాలు అయింది. అప్పుడే మూడేళ్లు అయిపోయిందా అన్న ఫీలింగ్ నాకు నిన్న సినిమా విడుద‌ల‌యిన‌ప్పుడు అనిపించింది. చిరంజీవిగారు స్క్రిప్ట్ ఓకే అన్నాక నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు గ‌డిపాను. ఒక చారిత్రాత్మ‌క చిత్రం ఇందులో పాట‌లు, డాన్స్‌లు ఉండ‌వు మెగా అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు. క్లైమాక్స్‌లో చిరంజీవిని చంపేస్తాం ఎలా ఉంట‌దో అనుకుని చాలా భ‌య‌ప‌డ్డాను. కాని ఇంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ చెయ్య‌డం చాలా క‌ష్టం. చిరంజీవిగారి అభిమానుల‌కు శిరస్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. మా టెక్నీషియ‌న్స్ అంద‌రికీ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. రాంచ‌ర‌ణ్‌గారి క‌ల చిరంజీవిగారి డ్రీమ్ ఓకే చేశారు. ఆ డ్రీమ్‌ని నేను ఫుల్‌ఫిల్ చేశాను. ఈ చిత్రం కోసం 500 మంది ఫ్యామిలీస్ క‌ష్ట‌ప‌డ్డారు. ద‌య‌చేసి పైర‌సీని ఎంక‌రేజ్ చెయొద్దు అని అన్నారు.

ఇదిలా ఉంటే  బాలీవుడ్ ప్రతిష్టాత్మక సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కించిన వార్ చిత్ర విడుదల కూడా సైరా ఈ పరిస్థితి కారణం అని చెప్పొచ్చు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్ హీరోల చిత్రం కావడంతో పాటు, భారీ బడ్జెట్ చిత్రం కావడంతో థియేటర్ల కేటాయింపు విషయంలో కూడా సైరా కు చాలా తక్కువ కేటాయించడం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: