మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మెగా ఫ్యామిలీ సంబరాలలో మునిగిపోయారు. ఇక ఈ సినిమాకు మొదటి రోజు కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉన్నాయని ప్రాధమిక సమాచారం మేరకు తెలుస్తోంది.  ఈ స్పందన చూసిన  'సైరా' టీమ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.


ఈ సందర్భంగా 'సైరా' నిర్మాత రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.   ప‌రుచూరిగారి ఆలోచ‌న‌ల‌కు నా శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. అలాగే సాయిమాధ‌వ్‌బుర్రాగారి డైలాగుల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా వ‌చ్చింది. గ్రాండీగారు డిఒపిగారు ర‌త్న‌వేలుగారు ఈ చిత్రం కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డారు. ర‌త్న‌వేలుగారు రంగ‌స్థ‌లం చిత్రానికి ప‌ని చేశారు. దాంతో నాన్న‌గారు అడ‌గ‌మంటే అడిగాను ఆయ‌న వెంట‌నే ఓకే చేశారు. అలాగే రాజీవ్‌గారు ఈ చిత్రం కోసం దాదాపుగా 40 సెట్స్ వేశారు. నేను ఈ ప‌నుల‌న్నీ చూసుకుంటూ ఉంటే. అక్క హ‌నీ కూడా డాడీని సెట్స్‌లో చాలా బాగా చూసుకుంది. అన్ని ప‌నుల్లోనూ బాగా క‌ష్ట‌ప‌డింది. హ‌నీఅక్క విద్యాఅక్క‌కి చాలా థ్యాంక్స్ అని అన్నారు. జ‌గ‌ప‌తిబాబుగారు చాలా మంచి మ‌నిషి ఆయ‌న గురించి ఇండ‌స్ట్రీలో చాలా మంది మంచిగా చెప్పారు. ఇప్పుడు నేను స్వ‌యంగా చూశాను. చాలా మంచి మ‌నిషి. అందుకే ఆయ‌నంటే మాకు చాలా అభిమానం. న‌య‌న్‌తార కూడా సినిమాలో చాలా బాగా న‌టించింది. మై ఫేవ‌రెట్ యాక్ట‌ర్ త‌మ‌న్నా చాలా బాగా చేసింది థ్యాంక్యూ సోమ‌చ్‌. మా యూనిట్ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. ముఖ్యంగా వీళ్లంద‌రీని చాలా కూల్‌గా మెయింటెయిన్ చేసిన మా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌కి చాలా థ్యాంక్స్‌. షూటింగ్ లేక‌పోతే ఒక్కోసారి నాకు అర్ధ‌రాత్రి 3గంట‌ల‌కి మెల‌కువ వ‌చ్చి నిద్ర‌ప‌ట్టేదికాదు ఉలిక్కిప‌డేవాడిని ఉపాస‌న కూడా ఏమ‌యింది అని అడిగేది. ఏదో టెన్ష‌న్‌లో ఉండేవాడిని.  అస‌లు ఎలా ఉన్నానో ఏంటో కూడా ఒక్కోసారి నాకే తెలియ‌దు. అప్పుడు నాకు నా సినిమా ప్రొడ్యూస‌ర్స్ టెన్ష‌న్ ఏంటో అర్ధ‌మ‌యింది. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన మా నాన్న‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: