రాబోయే సంక్రాంతిని టార్గెట్ చేసుకొని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో ’ అనే సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో బన్నీ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. నా పేరు సూర్య తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమా పై మెగా అభిమానులకు రాధా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చాలామంది అంటున్నారు.


ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో సుశాంత్ చేస్తున్న పాత్ర పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ఇటీవల వస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద చర్చగా అల వైకుంఠ పురంబులో సుశాంత్ క్యారెక్టర్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ కి అన్నయ్యగా నటిస్తున్నారంటే మరో కొంతమంది లేదు లేదు హీరోయిన్ పూజా హెగ్డే కి బ్రదర్ గా నటిస్తున్నారని తెగ మాట్లాడుతున్నారు.


ఇలా ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లుగా సుశాంత్ పాత్ర గురించి మాట్లాడుకుంటున్న నేపద్యంలో ఈ వార్తలు పెద్ద వైరల్ గా మారటం తో. సుశాంత్ ఎట్టకేలకు స్పందించాడు. తాను బన్నీకి బ్రదర్‌ని కాదు.. అదృష్టవశాత్తు పూజా హెగ్డేకు కూడా అన్నయ్యను కాదు. అసలు నా పాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే కాస్త వెయిట్ చేయండి అని ట్వీట్ ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో సస్పెన్స్ మళ్లీ మొదటికొచ్చినట్లైంది. కాగా ఈ సినిమాలో టాబు ఒక కీలక పాత్ర చేయటం విశేషం. రాబోయే సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: