పాయల్ రాజ్ పుత్ ఆర్.ఎక్స్.100 సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో మోగిపోయిన పేరు. ఈ సినిమా దర్శకుడు, హీరో కంటే కూడా హీరోయిన్ గా నటించిన పాయల్ కె విపరీతమైన పేరు, యూత్ లో బాగా క్రేజు వచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలలోనే అవకాశాలు వచ్చాయి. అందుకే కొన్నాళ్ళు ఆ సినిమాలు ఒప్పుకోకుండా దర్శక, నిర్మాతలను తిప్పి పంపించేసింది. కానీ తప్పదు కదా హీరోయిన్ అన్నాక వరుసగా వచ్చిన ఎలాంటి కథ అయినా నచ్చితే ఒప్పుకోవాల్సిందే. జనాలకు నచ్చినట్టు తెరమీద కనపాడాల్సిందే. అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్ అగర్వాల్ నటించిన సినిమాలో పాయల్ ఐటం సాంగ్ చేసి అందరికి షాకిచ్చింది. అంతేకాదు ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది. 

ఆర్.ఎక్స్.100' లాంటి బోల్డ్ సినిమాలో నటించిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు 'ఆర్.డి.ఎక్స్ లవ్' అనే మరో బోల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజస్ హీరోగా శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రోమోస్ బోల్డ్ కంటెంట్ తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. తాజాగా 'ఆర్.డి.ఎక్స్ లవ్' టీమ్ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ లో హీరో హీరోయిన్ల మధ్య బోల్డ్ రొమాంటిక్ సీన్లు ఆర్.ఎక్స్.100 ని మించి ఉన్నాయనిపిస్తుంది. మరి ఆ సీన్లు కథలో భాగంగా వస్తాయా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. ఓవరాల్ గా ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేల ఉండటం విశేషం. అంతేకాదు రిలీజైన కొన్ని గంటల్లోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న 'ఆర్.డి.ఎక్స్ లవ్' అక్టోబర్ 11 వ తేదీన రిలీజ్ కు సిద్దమవుతోంది. ఇక పాయల్ విక్టరీ వెంకటేష్ సరసన వెంకిమామ, మాస్ మహారాజ రవితేజ సరసన డిస్కోరాజా సినిమాలోను నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా మరికొన్ని చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: