ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో టీవీ ప్రేక్షకులకు రియాలిటీ షో బిగ్ బాస్ సుపరిచితం అయింది. 11వ వారం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో హౌస్ లో వాతావరణం మొత్తం మారిపోతుంది. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అన్న దాని విషయంలో ఎవరికి క్లారిటీ లేకుండా బిగ్ బాస్ తీవ్రమైన ఒత్తిడి చూసే ప్రేక్షకులకు ఇంట్లో ఆడుతున్న సభ్యులకు ఉండేలా టాస్కులు ఇస్తున్నారు. ఇటువంటి క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎక్కువ పాపులారిటీ ఉన్న శ్రీముఖి పై...మరియు ఆమె పెళ్లి పై జోకులు పేలాయి. ప్రస్తుతం ఇంటికి కెప్టెన్ గా ఉన్న శ్రీముఖిని టార్గెట్ చేస్తూ రాహుల్, వరుణ్ లు జోకులేసుకున్నారు.


శ్రీముఖి వాయిస్ ని కామెంట్ చేస్తూ.. శ్రీముఖికి పెళ్లి అయిన తరువాత కూడా అలానే అరుస్తుందేమోనని రాహుల్.. వరుణ్ తో అన్నాడు. దానికి వరుణ్ అరిస్తే వినిపించకుండా ఇయర్ ఫ్లగ్స్ కొనుక్కుంటాడేమో అని సెటైర్ వేశాడు. ఇక పునర్నవి తనను లేచిన వెంటనే ఎదవ అని తిడుతూ స్టార్ట్ చేస్తుందని రాహుల్ చెబితే దానికి వరుణ్ ఇష్టంతో తిడుతుందని అన్నారు.


తనకు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుందని అన్నాడు రాహుల్. ఇక ఎప్పటిలానే రాహుల్ తో పునర్నవి డెటాల్ కోసం గొడవ పెట్టుకుంది. వారిద్దరి మధ్య ఎవరైనా వెళ్తే బిస్కెట్ అవుతామ్ లైట్ తీస్కో అంటూ వితికా.. కెప్టెన్ శ్రీముఖికి చెప్పింది. రాహుల్, పునర్నవిల గొడవేంటో తనకు అర్ధం కావడం లేదని, గొడవ పడి ఇప్పుడేమో ఒకరితోఒకరు సరదాగా ఉంటున్నారని బాబా భాస్కర్ వద్ద చెప్పుకొచ్చింది శ్రీముఖి. మొత్తంమీద గురువారం జరిగిన ఎపిసోడ్ లో రాహుల్, వీతిక, వరుణ్ సందేశ్ మరియు పునర్నవి లు గ్యాంగ్ గేమ్ ఆడుతూ ఇంటిలో ఉన్న మిగతా సభ్యుల విషయంలో స్ట్రాటజీ లు వేస్తూ ఎప్పటిలాగే తమ సేఫ్ గేమ్ కొనసాగిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: