టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సినిమాలు లేకనే అంత పనిచేస్తోందట. స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ బ్యూటీ ఇపుడెందుకు ఇలా ఆలోచిస్తోందని ఆశ్చర్యపోతున్నారు. వరుస ఫ్లాప్ లతో ఈ బ్యూటీకి కెరీర్ పై క్లారిటీ వచ్చిందట. కొత్త జర్నీ స్టార్ట్ చేస్తోందట. 


దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ కు ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ లేవు. నేనేే రాజు నేనే మంత్రి తర్వాత కాజల్ నటించిన ఏ సినిమా కూడా బాక్సాపీసు వద్ద సక్సెస్ లేదు. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. దీంతో కాజల్ ఇపుడు తన స్టార్ స్టేటస్ మరిచిపోయి కొత్త టర్నింగ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 


కాజల్ చేతిలో తెలుగు సినిమాలు లేవు. కోలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ ఇండియన్ 2క్రేజీ సీక్వెల్ లో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు ఇపుడు కాజల్ వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమైందట. ప్రస్తుతం టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమలకు చెందిన యాక్టర్స్ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇపుడు కాజల్ కూడా తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్ లో కాజల్ నటించేందుకు సైన్ కూడా  చేసిందట. 


కాజల్ కు తెలుగుతో పాటు తమిళంలో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో వెబ్ సిరీస్ ను చేసేందుకు సిద్ధం అయ్యిందట. తమిళంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ను తెలుగు కూడా డబ్ చేస్తారట. నటిగా అవకాశాలు తగ్గడంతో కాజల్ కొత్త టర్న్ తీసుకున్నట్టు తెలస్తోంది. ఈ బ్యూటీ నిర్మాతగా మారేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. తక్కువ బడ్జెట్ తో వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: