టాలీవుడ్ కి చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. అయితే వచ్చిన వాళ్ళు లక్కు  బాగుంటే ఒక మూడు నాలుగు ఏళ్ళు  తమ హవా నడిపిస్తారు. ఆ తర్వాత కొత్త హీరోయిన్లు రావడంతో వాళ్ళకి క్రేజ్  తగ్గిపోతుంది. అయితే  అందరి హీరోయిన్స్ విషయంలో అలా ఉండొచ్చు కానీ... అందాల భామ కాజల్ అగర్వాల్ మాత్రం ఆ విషయానికి మినహాయింపు అని చెప్పాలి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి  దశాబ్ద పైగా  అయినప్పటికీ... ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. సీనియర్ హీరోల సరసన మెరుస్తూనే కుర్ర హీరోల ప్రక్కన ఛాన్స్ కొట్టేస్తుంది  ఈ అమ్మడు. లక్ష్మీ కళ్యాణం తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు... తెలుగులో దాదాపు అందరు హీరోలతో నటించి మెప్పించింది. 

 

 

 

 

 అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో నయా ట్రెండ్ స్టార్ట్ అయింది. అదే వెబ్ సిరీస్. సినిమాలకు మించిన క్రేజ్ ని  సంపాదించుకుంటు  అందరిచూపును  ఆకర్షిస్తున్నాయి వెబ్ సిరీస్ లు. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా వెబ్ సిరీస్  హవా గట్టిగా నడుస్తుంది. దీంతో సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటులు కూడా ఈ వెబ్ సిరీస్ ల  వైపు అడుగులు వేస్తున్నారు. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. 

 

 

 

 

 

 అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ తారలు అయినా కియారా,  రాధిక ఆప్టే... ఓవైపు వెబ్ సిరీస్లో మరోవైపు సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వెబ్  సిరీస్  వైపునకు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ లో విలన్ పాత్రలకు మారుపేరైన  జగపతిబాబు ఇప్పటికే ఒక వెబ్  సిరీస్ లో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కూడా వెబ్ సిరీస్ లో నటించేందుకు నిర్ణయించుకుందట. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో అందాల భామ కాజల్ నటించబోతుందని సమాచారం. అయితే ఈ వెబ్ సిరీస్ తమిళంలో తెలుగులో కూడా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: