సినిమా హీరోయిన్లు అంటే వెండితెర రారాణులు. వారి పక్కన ఎవరు హీరో అయినా చూసిన ప్రతీ ప్రేక్షకుడు తన పక్కనే ఆమె హీరోయిన్ అని వూహించుకుంటాడు. అలా అందమైన బంధాన్ని ఏర్పాటుచేసుకుని వూహాలోకంలో తేలియాడుతుంటాడు. తన హీరోయిన్ కి పొరపాటున పెళ్ళి కుదిరింది అన్న వార్త వింటే మాత్రం ఆ ప్రేక్షక ప్రేమికుడు తట్టుకోలేడు. ఆమె ఎపుడూ అలా కళ్ళ ముందు నటిస్తూ పదహారేళ్ళ పరువాల  భామగా ఉండాలని కోరుకుంటాడు.


అందుకే హీరోయిన్ల పెళ్ళి అంటే ప్రేక్షకులతో  ఓ అద్భుతమైన కనెక్టివిటీ తెగిపోతుంది. దాంతో హీరోయిన్లు పెళ్ళి వాయిదా వేస్తూ ఎప్పటికపుడు మూవీస్ లో నటిస్తూ ఉంటారు. అలా తమ గ్లామర్ ని, గ్రాఫ్ ని పెంచుకుంటూ ఉంటారు.  అయితే ఎపుడైనా వారు పెళ్ళిచేసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కూడా అందరి లాంటి మనుషులే. వారికి కూడా అన్ని బంధాలు, అనుబంధాలు కావాలి.


మరిపుడు అలా చూసుకుంటే టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్లు పెళ్ళి వయసు వచ్చేసిన వారు ఉన్నారు. అనుష్క, తమన్నా, నయనతార, కాజల్ వంటి వారిన్ చూసినపుడు మీడియా అడిగే మొదటి ప్రశ్న మీ పెళ్ళి ఎపుడు. దానికి వారి సమాధానం నవ్వు. ఇక విశాఖలో ఒక ఓపెనింగ్ కి వచ్చి సందడి చేసిన కాజల్ అగర్వాల్ ని ఇదే ప్రశ్న మీడియా అడిగినపుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా.


నాకు నచ్చిన వాడు దొరికిన వెంటనే పెళ్ళి చేసుకుంటాను. అందుకోసమే నేనూ చూస్తున్నాను అంటూ. ఇక తనకు కాబోయే భర్త తనలా ఉండకూడదట, డిఫరెంట్ గా ఉండాలట. మొత్తానికి కాజల్ అందమైన సమాధానం చెప్పి తప్పించుకుంది కానీ పెళ్ళి ఎపుడో క్లారిటీగా చెప్పలేదు. ఆమె చెల్లి నిషా అగర్వాల్ ఇప్పటికే పెళ్ళి చేసుకుని ఒక మగబిడ్డను కూడా కలిగి ఉంది.  ఆ విధంగా చూస్తే కాజల్ పెళ్ళి కాకుండానే పెద్దమ్మ అయిపోయింది.


మరి కాజల్ ఎపుడు పెళ్ళి చేసుకుంటుందన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కాగా తాను తమిళ్ క్వీన్ సినిమాలో ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నట్లుగా కాజల్ చెప్పింది. టాలీవుడ్లో కూడా అవకాశాలు వస్తున్నాయి నటిస్తానని అంటోంది. విశాఖ తనకు నచ్చిన బెస్ట్ ప్లేస్ అని కూడా చెబుతోంది. మొత్తానికి గడుసు కాజల్ మనసులో మాట మాత్రం బయటపెట్టలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: