పేరుకి ఈమె తెలుగమ్మాయి.. కానీ పెరిగింది చెన్నైలో అలా ఆమె తమిళ హీరోయిన్గా బాగా పాపులర్ అయింది. తెలుగు తమిళ చిత్రాల్లో నటిస్తూ ఎప్పుడు బిజీగా ఉంటుంది .ఈ బ్యూటీ తెలుగులో విక్టరీ వెంకటేష్ తరపున సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన అంజలి ఆ సినిమాతో ఒక హిట్ సినిమాను తన ఖాతాలో  వేసుకుంది. అంతకన్నా ముందు తెలుగు తమిళ్లో వచ్చిన జర్నీ సినిమాలో నటించింది. 


ఇకపోతే ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత గీతాంజలి సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాగా హిట్ అయింది. ఇకపోతే ఈ సినిమాలు అన్ని హిట్ అయినా కూడా ఆమెకు ఎక్కడ సినిమా అవకాశాలు రిలేదని చెప్పాలి. ఇకపోతే ఈమె గత కొద్దికాలంగా తమిళ సినిమాలకే అంతమైంది. అక్కడ మాత్రమే సినిమాలు చేస్తూ వస్తుంది. 


జర్నీ సినిమాలో జై సరసన గర్ల్ ఫ్రెండ్ గా నటించింది ఆ సినిమాతో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. అలా వాళ్ళు కొద్దిరోజులు ప్రేమాయణం సాగించారు. ఏమైందో తెలియదు గాని వీరిద్దరూ అనుకోకుండా విడిపోయారు. ప్రస్తుతం ఈమె మెడకు ఉచ్చు బిగుసుకుంది. అదేంటంటే.. ఓ కల్తీ వంట నూనె కంపెనీకి అంజలి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారంటూ తమిళ ప్రజలు ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఆ వంట నూనెను ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేస్తే అది ఆరోగ్యానికి హానికరమని వెల్లడైంది. దాని వాళ్ళ జనాలు ఆ కంపెనీ పై ఆ వార్త కు వాణిజ్య ప్రకటనలు చేస్తూ వచ్చిన హీరోయిన్ అంజలిపై కూడా కేసు నమోదు చేయాలనీ పిర్యాదు చేశారు. హానికరమైన వాటిని ప్రోమోట్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మధ్య యాడ్స్ చేస్తున్న హీరోయిన్స్ అందరు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మొన్న రాశి, రంభ నేడు అంజలి.. రేపు ఎవరనేది చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: