‘సైరా’ మూవీకి పాజిటీవ్ రెస్పాన్స్ రావడంతో ‘సైరా’ టీమ్ మీడియా ముందుకొచ్చి ఏర్పాటు చేసిన సక్సస్ మీట్ లో జగపతి బాబు వేసిన పంచ్ ఎవరిని ఉద్దేశించింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఈమూవీలో అమితాబ్ బచ్చన్ జగపతి బాబు కిచ్చా సుదీప్ విజయ్ సేతుపతి లాంటి హేమాహేమీ నటులు తమ పాత్రల పరిధి చిన్నవే అయినా ఆ విషయాలను పట్టించు కోకుండా నటించారు. 

ఇలాంటి సందర్భంలో ఏవిషయాన్ని అయిన ఎటువంటి  మొహమాట పడకుండా చెప్పే అలవాటు ఉన్న జగపతి బాబు నిన్న జరిగిన సకస్స్ మీట్ లో ఒక షాకింగ్ విషయం బయటపెట్టాడు. ఈ సినిమాలో నటించిన ఒక ప్రముఖ  ఆర్టిస్టు తనతో అన్నమాటను ఇప్పుడు చెప్తున్నా అంటూ ఈ మూవీ షూటింగ్ లో ఆ ప్రముఖ నటుడు తనతో అన్నమాటలను యధాతదంగ చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.    

‘చరణ్ మనల్ని కాస్ట్ లీ జూనియర్ ఆర్టిస్టులుగా తీసుకున్నాడా’ అంటూ ఆప్రముఖ నటుడు తనతో అన్న మాటను బయటపెట్టాడు. దీనితో జగపతి బాబుతో ఇలాంటి సెటైర్ వేసిన ఆ నటుడు ఎవరు అన్న విషయమై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. వాస్తవానికి ‘సైరా’ లో  మెగా స్టార్ చిరంజీవి పక్కన మిగతా పాత్రలు పెద్దగా ఎవరకి ఆనలేదనే టాక్ తో పాటు ఆపాత్రలకు సరి అయిన ప్రధాన్యత ఇవ్వలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి.  

అయితే ఇప్పటికే ఈ మూవీ నిడివి ఎక్కువ అయిపోయింది అని సగటు ప్రేక్షకుడి నుండి కామెంట్స్ వస్తున్న పరిస్థితులలో ‘సైరా’ మూవీలోని మిగతా పాత్రల పరిధి కూడ పెంచితే ఈ మూవీని ‘బాహుబలి’ లా రెండు భాగాలుగా తీయవలిసి వస్తుంది అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. ఏవిషయాన్ని అయినా జగపతి బాబు ముక్కు గుద్దినట్లుగా మాట్లాడుతాడు అన్న విషయం నిన్నటి అతడి స్పీచ్ తో మరోసారి నిజం అయింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: