అప్పట్లో వచ్చిన 'ప్రేమదేశం' సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అనేక రికార్డులు కలెక్షన్లు సాధించడం జరిగింది. 1996లో విడుదలైన ఈ సినిమా పాటలు ఇప్పటికీ అందరినీ అలరిస్తూ ఉంటాయి. అంతగా ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో హీరోలుగా అబ్బాస్, వినీత్ ఇద్దరు నటించడం జరిగింది. హీరోయిన్ గా ట‌బు నటించింది. అప్పట్లో వచ్చిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. కదిర్ దర్శకత్వంలో జెంటిల్ మెన్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.టి.కుంజుమోన్ ఈ సినిమాను నిర్మించారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు అప్పట్లో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ ఆల్బంగా నిలవడం జరిగింది.


అంతేకాకుండా సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమాలో నటించిన అబ్బాస్, వినీత్ ఇద్దరు కుర్ర హీరోలు ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోలుగా మారిపోయారు. ముఖ్యంగా అబ్బాస్ అయితే అప్పట్లో లవర్ బాయ్ గా సౌత్ ఇండియా లోనే ఓ వెలుగు వెలిగాడు. అయితే ఇటువంటి క్రమంలో అబ్బాస్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్న విషయాలను తాజాగా వినీత్ బయట పెట్టాడు. ప్రస్తుతం అబ్బాస్ న్యూజిలాండ్ దేశంలో కుటుంబంతో ఉన్నట్లు బాగా సెటిల్ అయినట్లు వినీత్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తనకు టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు.


వాస్తవానికి అబ్బాస్ కి మొదటి సినిమా ప్రేమ దేశం. కానీ మొదటి సినిమాతోనే అద్భుతమైన స్టార్ డాం సొంతం చేసుకున్నాడు. కోల్ కతా రాష్ట్రానికి చెందిన అబ్బాస్ వచ్చిన విజయాన్ని నిలబెట్టుకోలేక పోయాడు. తర్వాత అనేక సినిమాలు చేసినా కానీ పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో క్రమక్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో ఫ్యామిలీతో షిఫ్ట్ అయినట్లు వినీత్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అప్పట్లో అబ్బాస్ ఎక్కువగా ఫేమస్ అయింది తన హెయిర్ స్టైల్ వల్ల. అప్పట్లో 90 లో ఉన్న యూత్ ఎక్కువగా అబ్బాస్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేవాళ్ళు అంతగా పాపులరైన అబ్బాస్ ప్రస్తుత న్యూజిలాండ్ దేశంలో ఉంటున్నారు అని వినీత్ తెలపడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: