బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం వాతావరణం చాలా వైరల్ గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ రియాల్టీ షో లో ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఉంటారు అన్నది ఎవరు చూస్తున్న ప్రేక్షకులు అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ ఇస్తున్న షాక్ లు...చూస్తున్న ప్రేక్షకులు ఇంటిలో ఉంటున్న సభ్యులకు అర్థం కావటం లేదు. హౌస్ నుండి వెళ్ళిపోయారు ఎలిమినేట్ అయ్యారు అని ఇంటిలో ఉన్న సభ్యులు ఎవరికి వారు తమ స్ట్రాటజీ వేసుకున్న క్రమం లో తిరిగి హౌస్ లోకి వచ్చారు అలీ రెజా, రాహుల్. దీంతో హౌస్ లో ఉన్న సభ్యులు అందరూ షాక్ తిన్నారు. ప్రస్తుతం 11 వారంలో చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో 'బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్' ఇంటి సభ్యులకు ఇచ్చారు బిగ్ బాస్.


గురువారం జరిగిన ఎపిసోడ్ లో ఈ టాస్క్ లో భాగంగా బ్యాలెన్స్ ఫ్రేమ్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో శ్రీముఖి - అలీ - శివజ్యోతి - బాబా భాస్కర్ లు పోటీ చేశారు. ఈ టాస్క్ లో మొదట శ్రీముఖి బ్యాలెన్స్ తప్పి గేమ్ నుంచి ఔట్ అవ్వగా...ఆ తర్వాత అలీ బ్యాలెన్స్ తప్పాడు. ఇక చివరి వరకు శివజ్యోతి - బాబాల మధ్య బ్యాలెన్సింగ్ పోటీ జరిగింది. లాస్ట్ లో జ్యోతి కూడా బ్యాలెన్స్ తప్పడంతో బాబా విన్నర్ గా నిలిచాడు. అయితే గతంలో  బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవల్ 1లో విజేతగా నిలిచిన వితికాకు - బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవల్ 2 విజేతగా నిలిచిన బాబా భాస్కర్ లలో అసలు విజేత ఎవరో తేల్చాలని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వదిలేశారు.


బాబా భాస్కర్, వీతిక ఇద్దరిలో ఎవరు ఇష్టమైన వాళ్లు ఎవరు ఇష్టం లేని వాళ్ళు అని తేల్చాలని బిగ్ బాస్..ఇంటి సభ్యులకు నిర్ణయాన్ని వదిలేశారు. ఈ క్రమంలో నచ్చిన కంటెస్టెంట్ కి బొట్టు పెట్టాలని...నచ్చని కంటెస్టెంట్ కి తలపై గుడ్డు కొట్టి తమ అభిప్రాయాలను తెలియజేయాలని బిగ్ బాస్... ఇంటి సభ్యులకు ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న చాలామంది బాబా భాస్కర్ ని టార్గెట్ చేసి వితికా నీ గెలిపించారు. ఒక గ్రూపుగా ఏర్పడి బాబా భాస్కర్ కి ఎక్కువ గుడ్లు కొట్టి వితికా నీ విన్నర్ గా నిలబెట్టారు. మొత్తం మీద గురువారం జరిగిన బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ ఎపిసోడ్ లో...ఇంటి లోని సభ్యులు ఒక గ్రూపుగా ఏర్పడి బాబా భాస్కర్ ని టార్గెట్ చేసి ఆడిన గేమ్...హౌస్ లో సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేసింది. కులాయి కొట్లాట టాస్క్ లో కూడా..ఈ విధంగానే వ్యవహరించి..వితికా నీ గెలిపించటం జరిగింది. మరి రానున్న రోజుల్లో హౌస్ లో వాతావరణం ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: