మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన భారీ హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి`. బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చాసుదీప్, నయనతార, తమన్నా, జగపతిబాబు, రవికిషన్, నిహారిక తదితరులు నటించిన ఈ చిత్రం 150వ జయంతిగాంధీ జయంతి సందర్బంగా అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ లెవ‌ల్లో ప్యాన్ ఇండియా మూవీగా విడుదలై భారీ హిస్టారికల్ హిట్ గా నిలిచి విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఐటిసి కోహినూర్ లో ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్ లో…


మిల్కీ బ్యూటీ తమన్నా మాట్లాడుతూ – “లక్ష్మి నా కెరీర్ బెస్ట్ రోల్. ఈ సినిమాకు ఇప్పటివరకూ నా కొచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ లక్ష్మీ నరసింహారెడ్డి అని పిలవడం. ఒక యాక్టర్ కి ఇది బిగ్గెస్ట్ అచీవ్ మెంట్. మీ డ్రీం ప్రాజెక్ట్ లో నన్ను భాగం చేసినందుకు చిరంజీవి గారికి ధన్యవాదాలు. ఆయనతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుకుంటున్నాను. నా లుక్ కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. దానికి కారణమైన సుస్మిత గారికి థాంక్స్. అలాగే నన్ను ఇంత బ్యూటిఫుల్ గాచూపించిన రత్నవేలు గారికి స్పెషల్ థాంక్స్. చరణ్ అమేజింగ్ ప్రొడ్యూసర్.  చ‌ర‌ణ్ నువ్వేంటి రా హీరోనా ప్రొడ్యూస‌రా అని ఎంతో ఆనందంగా న‌వ్వుతూ... ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో రైటర్ సాయిమాధవ్ బుర్రా, డి.ఓ.పి రత్నవేలు, కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, యూ వి క్రియేషన్స్ విక్కీ, కొణిదెల ప్రొడక్షన్స్ సిఇఓ విజయ, వి ఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ కమల్ కణ్ణన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వాకాడ అప్పారావు, ప్రవీణ్, భూపతి రాజు తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: